పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215


పరచి మీరు లాభము గడించటయే నేను కోరినది. నూతన విధమగు చర్కాలు, ప లక ములు పయోగించి చక్కని అంద మైన వస్త్రమువలన లాభముగడించుటయే నేను కోరుచున్నదిప్రదర్శన ప్రారంభోత్సవము దేశమందలి ప్రతి బుద్ధి మంతునికొక యమూల్యమైన విద్యా, క్రియ పాఠముగరిపి తీరును. ఈ ప్రదర్శనము వివిద తరగతులలో జయమందుటకు ప్రతి వారు శక్తి కొలది ,ప్రయత్నము చేయవలసి యుండును. యీ జాతీయ సేవయందు పాల్గొనువారు నిజముగా ధన్యులన వచ్చును.


పై చెప్పిన విషయములు జయ మొందుటకు పరమేశ్వరుని ప్రార్థించుచు పదర్శనము ప్రారంభించుటకు గడంగుచున్నాను. మీసదుద్దేశ్యము, త్యాగ మీవిషయమున నాకు సాయపడునని విశ్వసించుచున్నాను.


నేతపరిశ్రమకు తగినంత ప్రోత్సాహము లేకుండుట వలననే దేశీయ పరిశ్రమలు నశించుచున్నవి. ఇప్పటి కైనను మన దేశమందు తయారగు వస్త్రములు పరిశ్రమ యొక్క యున్నత చిహ్నముగా గలవు. ఫ్రాన్సునందలి కొందరు స్త్రీలు సహితము మన సంగారెడ్డి పట్టు వస్త్రములను మిగుల ప్రేమించుచున్నటుల 'స్వానుభనము పై ఒక మిత్రుడు నాకు తెలియపరచెను. ఈ వస్త్రములను వారు తమ దేశపు వస్త్రములకు ప్రమాణ