పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216


ములని నుడువ గలిగిరి. ఈ వస్త్రములను వారు మిక్కిలి యపేక్షతో యిచ్చటినుండి తెప్పించుకొనిరి, ఆ పేరునం దిప్పుడు భండారు ఆగయ్యగారి వస్త్రాలయములో తయారగు వస్త్రములు కొన్ని చాలా అందమైనవి గను ప్రశంసాపాత్రములు గాగలవు. మన దేశపు నేత వారు కాలానుసారము నూతన పరిస్థితులలో అవసరములను బట్టి పురాతన విధముగా యితరవస్తువుల వారివలె, స్థిరపరచు సమయమే తెంచినది. పరిశ్రమాభివృద్దికై వీరు నూతన సంస్కరణము లవలంబించు టత్యవసరము. పద్మశాలీయులు నేత పరిశ్రమ తప్ప మరొకటి యవలంబించ కూడదని దెలుపు నారలలో నేనొకడను గాను. అవసరములను పరిస్థితుల నుబట్టి యితర గౌరవనీయమగు వృత్తులను యవలంబించవచ్చును. పద్మశాలీయ సంఘమునకు జెందిన మామితృలగు శ్రీ హకిం నారాయణదాసు, హకీం జనార్ధనస్వామి గార్లు వైద్యవృత్తిని యవలంబించి యున్నారు. పరిశ్రమ వృత్తి గలవారి సుపుత్రులందరు నేత పరిశ్రమకు ప్రాముఖ్యత నొసంగుట వారి విద్యుక్త ధర్మమని మాత్రము 'దెలుపగలను. తచ్చు ఆదాయముగల వృత్తులను యీ వృత్తికన్న మంచిదని భావించి స్వీకరించుట తగదు. సభ్యులారా! మా రెడ్డిజాతికి పద్మశాలి జాతికి ధృఢ మైన సంబంధము గలదని సగర్వముగా తెలుపగలను. వీ రుభ