పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

155


గరులో ప్రభుత్వమువారు స్థాపించిన అనాథ బాలుర ఆశ్రమమును పలుమారు దర్శించి బాలురకు మిఠాయిని పంచి పెట్టింతురు. మరియు దీని పాలక సంఘములో వీరొక సభ్యులుగా నున్నారు. డిచ్చల్లిలోని కుష్ఠురోగులకు సహాయము అనేక మారులు చేయించినారు. హైదరాబాదు నగరము లోను కొంత కాలము ఒక కుష్ఠురోగుల చికి త్సాలయమును స్వయముగా స్థాపించి చికిత్సలు చేయించిరి.


నగరములో వివజ్వరాలు వ్యాపించి ప్రతిదినమును వందల కొలది చచ్చు కాలములోను, ప్లేగు తీవ్రరూపమును దాల్చి ప్రజానాశనము చేసిన కాలములోను వీరు బీద వారికి మందులిప్పించి వసతులు కల్పించి, టీకాలను దీయించి సహాయపడిరి. ప్రభుత్వము నారును వీరి సాంఘిక సేవను గుర్తించి ఒక విలువగల గడియారమును బహుమతి - నిచ్చిరి. మరియు ఒక బంగారు పతకమును గూడ నిచ్చినారు.


అనాథుల పై వీరికెట్లు గాఢానురాగము కలదో అదే విధముగా శ్రీ రెడ్డిగారికి హరిజనుల పై నను మంచి అనురాగము కలదు. హిందువుల దురాచారములలో అగ్రస్థానము వహిం చినట్టి అస్పృశ్యతా దోషమును రెడ్డిగారు అత్యంతముగా నిర సించునట్టివారు. హరిజను లెందరో వారి సేవలో నియుక్తులై వృద్ధికి వచ్చినారు. మరియు ఈ రాష్ట్ర హరిజనులందొక విచా