పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154


ఆనాధులపై ప్రేమ


రాజా బహద్దరుగారికి అనాథ బాలబాలికల పైనను, వృద్దుల పైనను, రోగ పీడితుల పైనను, తుదకు జంతువుల పైనను చాల ప్రేమ. వీరు జంతు హింసా నివారణ సంఘములో ముఖ్యులుగా చేరి చాల సేవచేసినారు. కొత్యాలుగా నుండిన కాలములో అనాథ శిశువుల కేసులను విశేషముగా విచారించుట తటస్థించెను. హైద్రాబాదు రాష్ట్రములో " పెంపుడు పిల్లలు (పర్వర్గాల)ను ధనికులును, నవాబులను, రాజులును. తమ సేవలోనుంచుకొనుట ఆచారమైపోయినది. ఆ పిల్లలు శాశ్వత ముగా వారి బానిసలు గానుదురు. వారిని చాల కష్ట పెట్టుటయు సహజ మైయుండెను. ఈ విషయములను అప్పుడు పోలిసు శాఖా మంత్రిగా నుండిన సర్ - ట్రెంచి గారికి చెప్పి శాసన సభలో “శిశువుల సంరక్షక శాసనము"ను కావించుటలో ముఖ్య కారకు లైరి.


సికింద్రాబాదులోను హైద్రాబాదులోను“ వృద్ధాశ్రమములు" రెండుకలవు. అచ్చటికి పలుమారు వెళ్ళి దర్శించి ద్రవ్య సహాయముచేసి యితర ధనికులతో చేయించు చుందురు. గొప్ప వారి యిండ్లలో వివాహాది శుభకార్యము లైనప్పుడు వారివలన చందాలు వసూలుచేసి వృద్ధాశ్రమములకు మిఠాయిని కొని పంపించు చుందురు. అదేవిధముగా నగర సమీపమున సరూన