పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156


రకరమగునాచారముకలదు. కొందరుహరిజనులు తమ బాలికలకు చిన్న తనమందే “ముకళీలు అనియు "బసివి రాండ్రు" అనియు, పేరు పెట్టి వారిని యావజ్జీవ వ్యభిచారిణులనుగా నిర్ణయించుచుందురు. ఈ సంము కళంకమును తుడిచి వేయుటలో హరిజన నాయకులకు శ్రీ రెడ్డి గారివలె మరెవ్వమును సాయపడ లేదు.


రాజా బహద్దరు గారి సంతానము.

రాజూబహద్దరుగారికి మొదటి భార్య వలన శీయుత రంగా రెడ్డిగారు అనువారు కలిగినారు. రంగా రెడ్డి గారు జన్మించిన కొలది దినములలోనే వారి తల్లిగారు గతించినారు. రంగా రెడ్డిగారి కిప్పుడు సుమారు 50 సువత్సరముల వయస్సు. వారు కొంతకాలము పూనా లో విద్యాభ్యాసము చేసినారు. మెట్రికు వరకు చదివినారు. ఉర్దూలో మంచి పాండిత్యముకలదు. వారు సుమారు 99 సంవత్సరముల క్రిందట నిజాం ప్రభుత్వ ఆబ్కారీశాఖలో ఉద్యోగిగా నియమితులైరి. వారిప్పుడు ఆబ్కారీ డిప్టికమిషనరు పదవిలో నున్నారు. నెలకు రూ. 1000 జీతము పొందుచున్నారు. వారికి సంతానము లేదు.


రాజాబహద్దరుగారికి రెండవ భార్యవలన శ్రీయుత లక్ష్మారెడ్డి గారును, (శీమతి నరసమ్మగారు అను పుత్రికయు కలిగినారు. లడ్మారెడ్డి గారు పూనాలో విద్యాభ్యాసము ముగించిన తర్వాత ఇంగ్లాండుసకు వెళ్ళినారు. అచ్చట కొన్ని