పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

147


మాథ్యమిక పాఠశాలను స్థాపించి నడుపుచుండిరి. శ్రీమతి సీతమ్మగారు గతసంవత్సరము చనిపోయాయి.. ఇప్పుడా పాఠ శాల సీతమ్మగా కుమారుని చేతను, మనుమరాలిచేతను నడుప బడుచున్నది- ఆపాఠశాలకు శ్రీ రెడ్డిగారు చాల సహా యముచేసి యితరులచే చేయించి దాని అభివృద్ధికి కారకు లైనారు. ఇటీవలనే శ్రీ రెడ్డిగారి అధ్యక్షతలో ఆ పాఠశాల యొక్క వార్షికోతృపము అతి వైభవముతో జరుపబడెను.


సంఘసంస్కారము


రెడ్డిగారు పూర్వకాలపువారైనను మంచి సంఘసంస్కారులు. బాల్యవివాహములు కూడవనియు, వితంతూ ద్వాహములు చేయవలయుననియు, శాసనసభలో కీ! శే!! పండిత కేశవరావు గారు. రెండు చిత్తు శాసనములను ప్రవేశ పెట్టినప్పుడు వీరు ఆశాససములకు అనుకూలముగా చాల ప్రయత్నములు చేసిరి. వితంతూ ద్వాహశాసనమును విమర్శించి అభిప్రాయ మిచ్చుట కొక ఉపసంఘమును శాసనసభవారు నియమించిరి. అందు రెడ్డి గారు ముఖ్యులు. ఈ యుపసంఘము వారి అభిప్రాయము ననుసరించి తుదకు వితంతూద్వాహ శాసనమును ప్రభుత్వమువా రంగీకరిచిరి. రెడ్డిహాస్టలులో ఒక విద్యార్థి సుమారు 12 సంవత్సరముల క్రిందట వితంతూ ద్వాహము చేసికొనెను. దానికి వేంకట రామారెడ్డిగారు మంచి ప్రోత్సాహము కలిగించిరి.