పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148


రెడ్లలో ఎన్నియో అంత శ్శాఖలున్నవి. ఒకే శాఖ లోనే కులము తప్పులు పొందిన ఉప శాఖలను కలవు. ఈ మూర్జాచారములను పోగొట్టవ లెనని సుమారు 25 సంవ త్సరముల క్రిందటనే వేంకట రామారెడ్డి గారు ప్రారంభించి నారు. గద్వాల మహా రాజులగు శ్రీమంతు శ్రీసీతారామభూపాలరావు బహద్దరు గారి వివాహ కాలమునాడే వీరు మోటాటి పాకనాటి మున్నగు రెడ్లలోని ఉప శాఖలను అన్నంటిని ఏకము చేయవలెనను ప్రబోధముచేసి రాజుల యొక్కయు దొరలయొక్కయు, కుల ప్రముఖు, యొక్కయు, అంగీకారపు సంతకములు గైకొనిరి. వసపర్తి, దోమకొండ రాజులు, ఇందుకు సంపూర్ణముగా నంగీ కామిచ్చిరి. నాటినుండి యెన్నియో మారు లీవిషయమున ప్రబోధము జరుగుచు వచ్చెను. తత్ఫలితముగా మునగాల వారును, పింగిలివారును, ఇదిగాల వారును, మరి యిట్టివారెందరో అంతశ్శాఖావివాహములు చేసిరి. ఇప్పుడు గోనె, మోటాటి, పాకనాటి, గుడాటి, పంట అను రెడ్డికులశాఖలు కలిసి పోయినవి.


రాజు బహద్దరుగారిలో కుల భేదముల పట్టింపుగాని, మూర్ఖాచారాభిమానము కాని, మూఢ విశ్వాసములుగాని, (Orthodoxy and Superstition) ఏ మాత్రమునులేవు. 'వారు అన్నికులములవారితో, అన్ని మతముల వారితో భుజంతురు.