పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146


మని యితరులవలన మరికొంత ద్రవ్యమును ప్రోగుచేసి మంచి భవనమును కట్టించినారు. ఈ క్లబ్బులో రాణీలు మున్నగు పెద్ద పెద్ద వారు. సభ్యులుగ నున్నారు.


రిఫాహోఅం పాఠశాల.


నగరములో రిఫా హో అం అను మాధ్యమిక పాఠశాలను కొందరు విద్యా ప్రియు లైన ప్రజానాయకులు నడుపుచున్నారు. ఈ పాఠశాల యొక్క పాలక వర్గములో ఈ రెడ్డిగారు అధ్యక్షులై పాఠశాలను నడిపించుచున్నారు, ఈ పాఠశాలలో నిప్పుడు సుమారు 250 వరకు విద్యార్థులు చదువు నేర్చుకొనుచున్నారు.


బాలికా పాఠశాల (గొల్లఖడి )

హైద రాబాదు నగరములో గొల్లఖడ్కీలో నొక ఆంధ్ర బాలికా ప్రాథమిక పాఠశాలను ప్రజా సేవకులు కొందరు కలసి స్థాపించి నడిపించుచున్నారు. ఈ బాలికా పాఠశాలకును శ్రీ రెడ్డిగారే అధ్యక్షులు- ఈ పాఠశాల నగరములోని గొల్ల ఖడ్కీ చుట్టుపట్టులలో నుండు ఆంధ్ర బాలికలకు తమ మాతృభాషా ద్వారా విద్యను నేర్చికొనుటకు చాల సహాయ పడుచున్నది


పరోపకారిణీ బాలికా పాఠశాల (సికింద్రాబాదు)


సికింద్రాబాదు నగరములో శ్రీ కే. సీతమ్మగారు స్వార్థ త్యాగముతో తమ జీవితమునఁతయు ధారపోసి ఒక