పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121


ప్పుడు ఇండ్లను పడగొట్టవలసివచ్చెను. అప్పుడు ఇండ్ల యజమా సులతో ప్రతిఫల పరిష్కారార్థము ఒక న్యాయస్థానమునే ప్రత్యేకించి యుంచిరి. అందు విచారణ లై తీర్పులగువరకు చాల కాలము పట్టుచుండెను. రెడ్డిగారు ఇండ్ల యజమానులతో మాట్లాడి వారిని ఏదోవిధముగా తృప్తిపడునట్లు చేసి తొందర తొందరగా పరిష్కారములు చేయించి సహాయపడినారు.


(8) సర్ఫెఖాస్ గౌరవ కమిటీలో వీరు ఒక ముఖ్య సభ్యులు. ప్రతి కమిటీలోను వీరు కేసుల పరిష్కారములలో చాల సహాయ పడుచున్నారు.


(9) రాజా శివరాజబహద్దరు ఎస్టేటు చాల ప్రసిద్ధమై నట్టి సంస్థానము. దాని సంవత్స రాదాయము సుమారు 12 లక్షలు. ఆ సంస్థాన ప్రభువగు రాజా శివ రాజ బహద్దరు గారు “ధర్మవంత". అనుబిరుదము కలవారుగా నుండిరి. బిరుదమునకు తగినట్లే దానధర్మాలు చేసినవారు. తత్ఫలితముగా సంస్థానము సుమారు 20 లక్షల రూపాయీ లవరకు అప్పుల పొలయ్యెను. రాజా శివరాజ బహద్దరు పుత్రసంతానము లేక చనిపోగా వారిసంస్థానమునకు మరల వారసుల నిర్ణయమగు వరకు సంస్థాన పరిపాలనమును ఒక కమిటీ అధీనములో శ్రీపభువుగారుంచిరి. అకమిటీకి అధ్యక్షులై శ్రీ 'వేంకట రామా రెడ్డిగారు 1345 ఫసలీ నుండి 1349 ఫసలీవరకు సంస్టా 16