పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122


నమును ధర్మదృష్టితో పరిపాలించిరి. అప్పులన్నియు చెల్లించి తానా పదవిని వదలుకొనువరకు సుమారు 5 లక్షలు సంస్థాన గోశములో నిలువయుంచి పోయిరి. సంస్థానము లోని బీదరైతులకు సదా సహాయము చేసిరి. “ధర్మవంతు ఉన్నత పాఠశా లను" స్థాపించి సంస్థానపక్షమున నడిపించి, మగియు అనేక గ్రామములలో ప్రైమరీ పాఠశాలలను నెలకొలిపి విద్యావ్యాప్తి కనుకూలపడిరి. ఆ సంస్థానములో కేవలము భూమ్యాదాయశాఖా వ్యవహారములను పరిష్కరించుటయే కాక, ఆ సంస్థానపు పోలీసుశాఖకును అధ్యక్షులై (నాజిం) పోలీసుశాఖను సంస్కరించిరి. ఆ సుస్థాన వ్యవహారములను ప్రతి, బుధవారమునను, ప్రతి శనివారమునను సాయంకాలము 1 గంట లనుండి రాత్రి 9 గంటలనరకు విచారించుచుండిరి. ఈ ఉద్యోగమునకు గాను గౌరవార్థము నెలకు 110 రూపాయలు మాత్రమే అల వెన్సుగా వీరికి ఇయ్యబడుచుండెను.


(10) సహకారసంఘము (కోఆప రేటివ్ సొ సైటీ) లో వీరు 1334 ఫసలీలో చేరిరి . 1339 ఫసలీలో జరిగిన సంఘమహాసభలో పాల్గొనిరి. ఉపసంఘములో అధ్యక్షులుగా నియమింప బడిరి. సహకార సంఘపక్షమున 'వెలువడు మాసపత్రికలు నాలుగు భాషలలో వీరి అధీనమునుండి యే వెలువడుచుండెను. బెంగాలులోని శాంతి ని కేతనమునుండి ఖాళీ మోహన్ ఘోష్