పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120


(2) నగరము యొక్క మురికినీటి కాలువల పునర్నిర్మాణము ప్రారంభ మయ్యెను. (Drainage Scheme) దాని కార్యవర్గములోను వీరు సభ్యులై సలహా లిచ్చుచుండిరి.


(3) నగరములో ప్లేగు విశేష వ్యాప్తి నొందగా ప్రజల కనేక సౌకర్యములు కలిగించి చికిత్సలు చేయించి ఐసొలేషణ ఆస్పత్రికి పంపించియు, సగరమును వదలిన వారికి స్థలములు చూపించియు సహాయపడిరి. ప్లేగు నివారణ సంఘములో బహుకాలము సభ్యులుగాను నుండిరి.


(4) విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ (అనాథ శరణాలయము) యొక్క కార్యనిర్వాహక వర్గములో వీరొక ముఖ్య సభ్యులై యుండిరి.


(5) కొలతలను తూకములను సంస్కరించు సంఘములో సభ్యులై ( 1333 ఫసలీనుండి 1341 ఫసలీ వరకు పని చేసిరి.


(6) శాసనసభలో సభ్యులుగా నేటివరకును పనిచే యుచున్నారు. అందు ప్రవేశ పెట్టబడు ప్రతి శాసనమును శ్రద్దగా చూచి ఏమర్శించి మంచిసలహా లిచ్చుటలో ముఖ్యులని ప్రసిద్ధిగాంచినారు.


(7) నగరాభివృద్ధిశాఖ, (ఆరాయి షెబల్ద) లో సభ్యు లై పనిచేసినారు. ఈ శాఖవారు వీధులను విశాలపరచిన