పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తొమ్మిదవ ప్రకరణము

ఇతర ప్రభుత్వశాఖలలోని సేవ.


కొత్వాలీ పదివిలోనే రెడ్డిగారి కాలమంత యువినియోగిం పబడుచుండెను. పలుమారు సగము రాత్రి వేళలందును వారి పడక పక్కననుండు టెలిఫోనుతో క్రింది అధికారులేకాక సగరమందలి గొప్పగొప్ప వారును అవసరముకొలది వారిని లేపి మాట్లాడివారు. రాత్రు లందును ప్రాతః కాలమందును ఇంటివద్దనుకూడ జనులు దరఖాస్తులు పట్టుకొని పోవుచుండిరి. ఇట్లు విరామము లేనివారైయుండినను రెడ్డిగారు నగరము లోని అనేక శాఖలలో ఏదోయొక గౌరవోద్యోగ కార్యమును నిర్వహించుచు వచ్చినారు. అవన్నియు విపులముగా వ్రాయ బూనిన గ్రంధము పెరిగిపోవును. అందుచేత సంగ్రహముగానూచన మాత్రము చేయబడును.


(1) 1329 ఫసలీలో వీరు నగర పురపాలక సంఘ ములో సభ్యులైరి. మరియు 1336. ఫసలీనుండి 1339 ఫసలీవరకు పురపాలక సంఘము యొక్క ఉపాధ్యక్షులుగా నియుక్తులై చాల దక్షతతో పనుల నెర వేర్చిరి.