పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4


తియు, వాని సిగూఢత్వమును రాజాబహద్దరు వారి జీవితము లోని యత్యంత అద్భుతకధ నాత్మక విషయమై యున్నది. సంగతియేమనగా, వారిలో రహస్యము లేదు. కాని సమత కలదు. నంరతయే వారిస్వభావము. గద్దెమీదనుండుటకంటె గద్దె వెనుక నుండియే తమ శక్తి యుక్తులను ప్రయోగించుటయే వారి యభిలాషము, శీఘ్రాభి ప్రాయులకు శ్రీ వారు వీరసులుగను, వాగ్మిగాను గనబడవచ్చును. నిజముగా వాగ్మియే కాని విరసులుగను మాత్రము కారు. రాజాబహద్దరు వారికంటే ప్రేమ హృదయులను, ఔదార్యభావులను నేను సందర్శించి యుండ లేదు. సాంసారిక జీవితమందెట్టి సత్యమిత్రమో, ప్రజా హిత జీవితమునం దంతయు సత్య సహచరులు.హిందువులకెట్లో ముసల్మానుకును అట్లే ప్రియులయి యున్నారు. రాజబహద్దరు గారు, జాతీయ లేక ధార్మిక వైమసస్య సంబంధములగు అభ్యంతరములతో సంకటపడు వారు కాక పోవుటచే, ఇట్టివారే, శుద్ధమైన హిందూ ముసల్మానులు ఐక్యతను పెంపొందింపగల రనుట ధృవము. వీరిది సంయోగము చెందిన ప్రతిభ. ఈ సంయోగము పరస్పర | ప్రేమవలససు, సహనభావము, ఒద్దిక వలపను ఏర్పడినదేశాని బలవంతమునో, కార్యనీతిని పురస్కరించుకొనియో ఒకరిలో మరియెకరు ఐక్యము కావలయునను ప్రయత్నము లద్వారా ఏర్పడి