పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5


నది కాదు. హిందువుల యెడను, రెడ్ల యెడను చూపెడు మైత్రి కంటె, ముసల్మానులయెడ చూపెడు మైత్రి తక్కువది కాదు. దీనికి ముఖ్య కారణ మేమనగా, వీరు ఇతర విషయ భావసల నటుంచి, శ్రీ నిజాము (ప్రభువు వారియెడను, రాష్ట్రము నెడను, తన రాజభక్తికిని, విధ్యుక్త ధర్మనిర్వహణమునకును ప్రధాన స్థానమిచ్చి యున్నారు.

ప్రఖ్యాతులగు శ్రీరాజ బహద్దరు వారిదగు సుచారిత్రమును పెక్కుమంది, ఉత్సాహముతో పఠించెడరుగాక యని నమ్ముచున్నాను. రెడ్డికుల రత్నమగు నీనిరాడంబర నాయకు డు, భావితరముల వారికిని, ఇన్నేండ్ల నుండి మా కృతజ్ఞతాబద్ధ ప్రశంసకు పాత్రమైన జీవశక్తి దాయక ప్రాబల్యమును ప్రసాదిం చుచుండును గాక!

తన రాష్ట్రమునకును, దేశమునకును, సంఘమునకును తన ఘనమైన సేవను అర్పించుచు, శ్రీరాజా బహద్దరు వారు బహుకాలము సౌఖ్యజీవితమును నడిపెదరుగాక. 4