పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3


తన కోడలగు ఇంగ్లేయ కన్యకను అత్యంత ప్రీతిపూర్వకముగ సంభావించిన విధము, రాజబహద్దరు వారి సమధిక యాదార్యశీలమునకు ఉత్త మోత్తమ ప్రబల తార్కాణముగా నా మనోవీడియందు ఎల్లప్పుడు నుండఁగలదు. దుష్కరమయిన అధికారపదవిని వహించుటయే గొప్ప విషయమై, అసామాన్యమైన కీర్తి ప్రతిష్ఠలకు కారణభూత మయినను, శ్రీ వారు కేవల మధికార పదవిమోహితులై తృప్తిపడి యుండ లేదు. వారికి సహజమగు నిరాడంబర విధమున దుఃఖ బాగులయిన ప్రతివారికి మిత్రులున , ఉప దేశకులును అయియుండిరి. రెడ్డి సంఘీయుల సముద్ధరణాత్మకములగు సవస్త ప్రతిష్టాపనము లకును దోహద మొసంగిరి. కావున రెడ్డి వసతి గృహము, రెడ్డి గ్రంధాలయము అను గొప్ప సంస్థల ప్రతిపాదకులలో నొక్కరని పరిగణింప వచ్చును. ఈ సంస్థలు హైద్రాబాదులోని రెడ్డి సంఘముల విజ్ఞావవికాసమునకును, సాంఘికాభి వృద్దికిని మహోత్కరములయి యుండుట గమనింపదగిన యంశము. శ్రీవారి సానుభూతి, నిర్మాణచాతుర్యముల మూలముననే ఆంధ్ర బాలికల విద్యా విషయమునకును ప్రబల ప్రోత్సాహము కలిగినది. హైద్రాబాదు ప్రాంతేతర భాగములందును, వీరి నిరాడంబర జీవిత ప్రాబల్యము ఫలరహితముగా నుండి యుండ లేదు. వీరానందించు హితవర్ధక కార్యకలాపముల విస్తృ