పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117


ఎ కాంఅలీ అనువారు 19 ఆర్ది బెహిష్తు 1335 ఫసలీనాడు రెడ్డి గారికిట్లు జాబువ్రాసిరి. " మీ యద్యోగ కాలమును ప్రభుశ్వము వారు పొడిగించిన వార్త నాకు పరిమితి లేని ఆనందము కలిగించినది. హైదరాబాదు ప్రజలవిషయమన మీ అస్తిత్వము దైప ప్రసాదిత మైన వరమువంటిది. దక్కన్ చరిత్రలో ఈ అధికార కాలము ' స్వర్ణా క్షరములలో వ్రాయదగినదై యున్నది. మీ ఉద్యోగ కాలములో హైద్రాబాదు ప్రజలకు లభించిన శాంతి భద్రతలు మరెవ్వరి కాలములోను నేటి వరకు లభించినవి కావు. ... ఏ విధముగా మీయుద్యోగ కాలము హెచ్చుచున్నదో అదేవిధముగా పరమాత్ముడు మీ ఆయుర్వృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదించుగాక"


పోలీసు చరిత్ర (History of the Police ), అను ఉర్దూ గ్రంధము వ్రాసిన మోర్ విలాయతు హుసేను గారు రెడ్డి గారిని గురించి యిట్లు వ్రాసినారు.


“ వేంకట రామా రెడ్డిగారు కొత్వాలు అయిన కాలములో పోలీసు (డిసిప్లిన్) క్రమ శిక్షణములో మంచి మార్పు కలిగెను. వారు తమ దీర్ఘానుభవము చేతను సర్వజన ప్రియత్వ ముచేతను తమ శాఖను ఉత్త మవిధముగా వశమందుంచుకొని కార్యసాధన కావించిరి. పోలీసు కార్యనిర్వహణలో వీరిశా