పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116


దుకు వారు వినిరా సరియే. తీర్పుచేసి పరిష్కారము చేయుదురు. వినకపోయిరా అన్యాయమే జరిగినదని వారికి స్థిరపడిన నాల గైదుమారులు త్రిప్పించి విచారణలు చేయుచుందురు. “అయ్యా, ఈవిచారణపోలీసు శాఖకు సంబంధించినది కాదు' అని యెవ్వరైనను ఆక్షేపించిన “ఆ సంగతి మా విచారణ పూర్తి యైన తర్వాతకదా నిర్ణయింపబడును". అని యింకను విసిగించెడివారు. తుదకు ప్రతిపక్షులు వారు చెప్పినట్లు వినుకొని పోయెడివారు. ఇట్లు చేయుటవలన బీదల కెంత యోశ్రమ, కష్టము, నష్టము, అన్యాయము అన్నియు తప్పిపోయెడివి. కొన్ని మారులు కొందరు ఉన్నతన్యాయస్థాన న్యాయాధికారులకు వీరి యీ సంబంధము లేని విచారణల వలన న్యాయస్థానానికి స్టాంపుల నష్టము కలుగుచున్నదని మొరపెట్టుకున్నారట. ఆందు పై ఒక తడవ ఉన్నత న్యాయస్థానపు న్యాయాథి కారి యొకరు వీరికి చ్చేరీలో వీరి ప్రక్కననే కొన్ని గంటల కాలము కూర్చుని వీరి తీర్పులను నెమ్మదిగా విని ప్రభుత్వానికి నష్ట మైనను వీరు బీదల పాలిటి కల్పవృక్షము, న్యాయమే పరిపాలించుచున్నారు" అని పలుకుచు సెలవు తీసికొని పోయి నారట


వేంకట రామారెడ్డి గారి కొత్వాలీ యుద్యోగ కాలము మరల 1335 ఫసలీలో హెచ్చింపబడి నపుడు గుల్బర్గాలో రెవిన్యూ (మాల్), మదద్దారు పదవిలోనుండిన మహమ్మద్