పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118


ఖలో ఏమియు లోపము కలుగ లేదు. వీరు హిందువులగుట చేత రాజకీయ పరిస్థితులలో తీవ్ర స్వరూపము దాల్చకుండ జరిగి పోయెను ...... ఈ కాలములో మతకలహములు అంతటను చెలరేగు చున్నవి. కాని వేంకట రామారెడ్డిగారు అట్టివేవియు నగరములో తలనెత్త నీయక నిరోధించియుంచినారు.. -ఈ ప్రకారముగా ఇంకను పై గ్రంథకర్త గారు కొత్వాలు వేంకటరామా రెడ్డిగారిని గురించి ప్రశంసించుచు వ్రాసి యున్నారు.


"రెడ్డిగారు కోత్వాలు పదవినుండి 25 అమర్దాదు 1343 ఫసలీనాడు విరమించుకొని ఉపకార వేతన మందిరి. వీరిజీతములో సగము అనగా 210 రూపాయిలే వీరికి ఉప కార వేతనముగా దొరుకవలసియుండినను మ. ఘ. వ. ప్రభు పుగారు వీరి గుణవి శేషములను, యావజ్జీవ సేవ, భక్తి శ్రద్దలను, ప్రశంసించుచు వీనికి ప్రత్యేకముగా 210 రూ|| లకు మారుగా నెలకు / 1000 రూ! లు లభించునట్లు ఫర్మాను ఇచ్చిరి".