పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

111


తక్కువ పని కాలము ఏర్పాటు కావలెననియు, సమ్మెకట్టి హడ్తాలు చేసిరి. ఆసమయమున చాల అల్లరులు జరుగునట్లుండెను. అప్పుడు రెడ్డిగారు రెసిడెన్సీ ప్రభుత్వమనకు అత్యంతముగా సహాయపడి సమ్మెదారులను తృప్తి పరచి ఏఅవాంతర ములును జరుగకుండు నట్లుగా సహాయపడిరి. ఈ విషయమును గురించి జిల్లా పోలీసు డైరెక్టర్ జనరల్ గారికి సహాయాధికారిగా నుండిన మీర్ విలాయత్ హుసేనుగారు తాము రచించిన “హైద్రాబాదు పోలీసు చరిత్ర : అను గ్రంథములో నిట్లు వ్రాసినారు.


" వీరి యీసహాయమువలన ' కేవలము మాప్రభుత్వమే కాక రెసిడెంటుగారున్ను వీరికి కృతజ్ఞతల నర్చించిరి. దీనికి ప్రతి ఫలముగా వీరికి ఓ. బి. ఇ. బిరుదము ఇచ్చి యుండవచ్చు సనుటలో నేమి యాశ్చర్యము?"


రాజా బహద్దరు వేంకట రామారెడ్డిగారికి -క్రీ. శ. 1931 సంవత్సరాదిలో (1340 ఫసలీలో) జార్జి చక్రవర్తి గారి నుండి “ఓ. బి. ఇ.” అను బిరుదము ప్రసాదింపబడెను. ఇంతకు మునుపు రాజాబహద్దరు బిరుదము లభించినప్పుడు అన్ని శాఖల వారే ప్రకారముగా వీరిని గౌరవించిరో అదే ప్రకారముగా ఈ ఓ. బి. ఇ. బిరుదము లబించినప్పుడును ప్రీతి పూర్వకముగా సభలు విందులు చేసి గౌరవించిరి, స్థానిక పత్రిక లన్నియు వీరి సత్యంతముగా ప్రశంసించెను. "