పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110


హిందూ ముసల్మాను నాయకులందరును వీరి చేతిలోని వారై యుండెడివారు. వారి కేదోవిధముగా సమాధానములు చెప్పి సంతృప్తి పరచి వారిని తన వశమందుంచుకొనెడి వారు, అందు చేతనే వీరి కాలములో అశాంతి ఎన్నడును ప్రబల లేదు.మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు వారు ఒక ఖద్దరు ప్రదర్శనశాలను దర్శించువారై యుండిరి. కాని సర్ ట్రెంచి గారి నిషేదాజ్ఞ అయియుండెను. గాంధీ గారికి ఆగ్రహము కలిగి తమ కార్యక్రమము నంతయు ఆపివేసి వెంటనే వెళ్ళిపోవుటకు సమకిట్టిరి. అప్పుడు కొత్వాలు వేంకట రామారెడ్డి గారు వారితో స్వయముగా కలిసి మాట్లాడి సమాధానము చెప్పి శాంతిపరచి మరల కార్యక్రమము సాగించు కొనునట్లు చేసిరి.


మ. ఘ. వ. నిజాం ప్రభువుగారు - 27 బహమన్ 1339" ఫ. నాడు తమ జన్మదినోత్సవ సందర్భమున రెడ్డి గారికి “రాజాబహద్దరు:" అను బిరుదమును అనుగ్రహించిరి. ఆ బిరుదమును పొందినందున నగరములోని హిందువులును ముసల్మానులును ఒక రినిమించి యొకరు వారి గౌరవార్థము సభలు చేసిరి. ఎన్నియో విందులు చేసిరి.


సికింద్రాబాదు రైల్వే లాలగూడా కార్యాలయము లోని వేలకొలది కూలీలు ఎక్కువ జీతములు కావలెననియు