పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109


కొన్ని మారినను వేంకట రామారెడ్డిగారు ప్రతిదినము తప్పని విధిగా తమ యేలిక తో కలిసి వచ్చెడివారు. కొన్ని సమయములలో కచ్చేరీ పనులు చేయు సమయములో శ్రీ ప్రభువుగారి నుండి టెలిఫోన్ వచ్చెడిది. అన్నియు పదలి తృణమే వెళ్ళి వచ్చెడివారు. మరియు ఒక్కొక్కమారు దినమునకు రెండు ముడు మారులు సహితము శ్రీ ప్రభువుగారితో కలిసెడి వారు ఒక్కొక్క తడవ రెండు మూడు గంటల కాలము ప్రభు సన్నధిలో నిలిచి అజ్ఞలన పొందుచుండెడివారు.


ఎవ్వరినైన మెప్పించవచ్చును గాని ఏలికను మెప్పించుట సామాన్యమైన విషయము కాదు. వేంకట రామా రెడ్డిగారు శ్రమ ఏలికను సంపూర్నముగా మెప్పించినారు. వీరి యుద్యోగ కాలము. పూర్తియై ఉపకార వేతసమును పొందవలసిన కాలము వచ్చినను ప్రతి సంవత్సరమును శ్రీ ప్రభువుగారు వీరి యుద్యోగకాలమును పొడిగించుచునే వచ్చిరి. క్రొత్త రెసిడెంట్లు వచ్చినప్పుడు గాని, వైస్రాయీలు వచ్చినప్పుడుగాని, ఇతర దేశీయ సంస్థాన పరిపాలకులు వచ్చినప్పుడుగాని, ప్రతి సంవత్సరము శ్రీ ప్రభువు గారి జన్మదినోత్సవములు జరిగినప్పుడుగాని, దేవిడీలో ఏర్పాటగు విందులందును, రాజకీయపు విందులందును ముఖ్యమగు ఏర్పాటులన్నియు వీరి ద్వారానే చేయించు చుండెడివారు.