పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112


రెడ్డిగారి కొత్వాలీ కాలములో నింకొక విశేషముండెను. సాధారణముగా పోలీసు వారనిన కఠినులనియు, భయంకరులనీయ, జనుల విశ్వాసము. శ్రీ రెడ్డిగారు పోలీసు ఉద్యో గములో పరమావధి పొందినహరైనను, సర్వశక్తి మంతులై యుండినను, శ్రీనిజాం ప్రభువుగారి మున్ననకు సంపూర్ణముగా పాత్రులైనను ఒక నాడును తనను తాను మరచి యెరుగరు. గర్వమనునది వారి జీవిశములోనే లేనట్టివి. అధికార మత్తత యనునది వారికి చిన్నప్పటినుండియు అలవాటు కానట్టి గుణము. వారిని జూచి దుర్మార్గులు మాత్రమే భయపడెడి వారు. అట్టి దుర్మార్గులును వారి దయాగుణమును గుర్తించి వారికి వశవర్తులగు చుండెడివారు.


హైదరాబాదు నగరములో దావూద్ అను పేరుగల ఒక గజదొంగ యుండెను. వాడు ఒకటి రెండు మారులు జెయిలు శిక్షనుబొంది అచ్చటినుండి తప్పించుకొని పోయినట్టి వాడు. పలుమారు మార్వాడీ దుకాణములపై బడి మార్వాడీలను బెదరించి వారినుండి సొమ్ములు లాగుకొనుచుం డెడివాడు ఒకతడవ వానిని పట్టుకొని హైకోర్టులో విచారణకై పోలీసువారు తీసికొని పోయియుండగా అచ్చట బహిర్భూమికని కొట్టిడీలోనికి పోయి అందలి రంధ్రములలో జొరబడి తప్పించుకొని పోయి యుండెను. వానిని పట్టుకొనిన వారికి మంచి