పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                    వేమన వంటివారు 93

యన్నట్లు *[1] ఇతరులమతమును, వారెట్టివారైనను, తన విమర్శపుసానలోఁ బట్టి చూడ వలెను. అట్లుగాక వేదములు ఒకరు వ్రాయక తమంతటఁ బుట్టినదని, వానిలోనెల్ల నొకటేవిషయమును ప్రతిపాద్యమని, దానికి ప్రతిబింబము పంచమవేదము మహా భారతమని, దానిసారము భగవద్గీత యని, దానిని 'పిసికి పిండిలి చేసిన పిడుచ' తమ మతాచార్యుల భాష్యమేయని, దానికి తమ తాతగారు వ్రాసిస వ్యాఖ్యానమే సరియైనదని-కన్నులు మూసికొని, తలవంచుకొని, ఉన్నవివేచనాశక్తి కంతయు నూలునీళ్ళు వదలియుండుట ఆ శక్తినిచ్చిన భగవంతునియెడఁజేయు మహాపచారము. ఇట్లు మహాపురుషులగు మతకర్త లవతరించి చాలసూక్ష్మదృష్టిచే తత్త్వ ములను చర్చించి తమకుఁదోచిన సిద్ధాంతమును స్థాపింపఁగా, వారిమహత్త్వమును జూచి విస్మితులైన తరువాతివారు, దానికిమించి తామేమియు తెలిసికొసఁ జాలమని, దీనులై, తమ సర్వస్వమును వారికి ధారపోయుచు, తమకన్న నజ్ఞానులగువారు తమ విషయ మందట్లో విధేయతతో వర్తించునట్లు బోధించి, స్వాతంత్ర్య మనుపదార్ధమే నశింపఁజేయుచుండఁగా, వారి నా నిద్రనుండి మేల్కొల్పుటకు స్వతంత్ర విమర్శ మును వారియెడ నంకురింపఁ జేయుటకు, కొందఱు బయలుదేఱకున్న ముక్తిలేదు ఇట్టివారిలో వేమన యాంధ్రులలో ముఖ్యుఁడని యొఱి(గితిమి గదా! అతని వంటి వారిని మఱికొందరిని గూర్చి నేఁడు సంగ్రహముగా విన్నవించున్నాను.

ఇట్టివారిలో వేమన్న తరువాత నందరికంటే మొదలు మన మెఱుఁగఁ దగినవాఁడు -

సర్వజ్ఞమూర్తి

ఇందుకు రెండు కారణములు గలవు. వేమన్న కితఁడు అచ్చపు ప్రతిబింబము వలె నుండుట యొకటి. రెండవది కన్నడమువాఁడగుట. మొదటినుండి తెలుఁగు వారికి కన్నడమువారియంత సమీపబంధుపులు ఇతరులుగారు. దేశములు రెండును చాలవఱకంటుకొనియుండుటయేకాక, ఇరుతెగలవారును పలుమాఱొకరి నొకరు ఏలుచును, ఒక్క రాజనకే లోపడుచునుండి, మతప్రచారము, వాజ్మయ రచనము మొదలగు విషయములం దొకరికొకరు సేవచేసినవారు. కొవుననే యిరువురి మార్గములును చాలవఱకొకటే తీఱుగా నుండును. అట్లగుటచేత వారు మనలఁ గూర్చియు, మనము వారిని గూర్చియు తెలిసికొనవలయుననుట ముఖ్యధర్మమని వేఱుగ చెప్పఁ బనిలేదు.

వేమన్న చరిత్రమునుగూర్చి యెన్ని చిక్కులుగలవో యితనినిగూర్చియు సన్ని కలవు. 'బసవరసు' అను ఆరాధ్య బ్రాహ్మణునికిని, అంబలూరు అను గ్రామము లోని కుమ్మరి విధవయగు మాళి" అను దానికిని ఇతఁడు జనించినట్లు కథ ; కథయే కాదు, అతని పేరిటి పద్యములును గలవు. †[2] కాని యితఁడు చిన్న నాఁటి నుండి తల్లిదండ్రులను లక్ష్యపెట్టక, తాను పరమేశ్వరుని వరమున జనించిన వాఁడనియు, మన్ను కైలాసమున ఈశ్వరుని సేవకు(డైన పుష్పదత్తుడనువాఁ

 1. ఈ పద్యము వేమన పద్యములలోను గలదు, 3519.
 2. † చూ, ధార్వాడ ఉత్తంగి చెన్నప్పగారు ప్రకటించిన 'సర్వఙపడగళు", పీఠికా ప్రకరణము.