పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ:

ఆఱవ యుపన్యాసము

వేమన వంటివారు

మతము, రాజ్యము మొదలగు నేవిషయములందు సంఘమున కధఃపాతము గల్లినను దానినుద్ధరించి సంస్కరించుటకు ఒక్కఁడు జనించినఁజాలదు. అతc డెంతటి మహాపురుషుఁడైనను మనుష్యుఁడే కావున మానవసామాస్యములగు నిర్బంధములకును మేరలకును లోఁగక తీఱదు. అందును జాతులు భాషలు వేఱువేఱుగా (గల హిందూసంఘము వంటిదాని నొకఁడు నిర్వహింపఁగల్గుట యట్లుండనిండు; దానికి ప్రయత్నించుటయే యసాధ్యము. కావున నిట్టిసమయము లలో సంస్కరణోద్రేకముతో నిండిన యనేకులు బయలుదేఱుదురు. మనకుఁ గల్లిన యిప్పటిరాజకీయాధఃపాతమును సంస్కరించుట కెందఱు మహామహు లవతరించు చున్నారు చూడుఁడు. ఇట్లే వైదికమతమును ఇతర మతములను వేఱువేఱుగా స్థాపించిన యాచార్యుల తరువాత, మనుష్యులకు సహజమైన సుఖకాంక్ష, స్వార్థపరత మొదలగు గుణములచే, ఆయా మతములవారు పారమార్ధికదృష్టి చాలవఱకు నశించి, బహిరాడంబరములలో మాత్రము జాగ్రత్తగలిగి వర్తించుచు, ఆజ్ఞానమునకు ఆ కార్యమునకును మతమొక సాథనముగాc జేసికొనగా సామాన్య ప్రజల నాయవస్థనుండి తప్పించి సన్మార్గమున కీడ్వవలెనని ప్రయత్నించిన వేమనవంటివారు హిందూసంఘ మందనేకు లుదయించిరి. వారు తలఁచిసటే సన్మార్గము కాకపో పచ్చను. కాని యెప్పటి సామాన్యసంఘమున్నది మాత్రము సన్మార్గము కాదనుటలో సందేహము లేదు. తత్వము, నీతి, ధర్మము మున్నగువిషయములను తమ మసస్సాక్షి చేతను అనుభవముచేతను నిర్ణయించుటకు బదులు, తమపెద్దలు మాటలను వినియో, లేక వారిపెద్దలు వ్రాసిన గ్రంథములను చదివియో నిర్ణయించుస్థితికి వచ్చిన సంఘము బ్రతుకు బొమ్మలాటవంటిదే కాని సత్తువగలపదార్ధము గానేరదు. అనగా, అందఱును తమంతట పైవిషయములను నిర్ణయించుకొనుట సాధ్యమా న్యాయమా ? యుని యడుగవచ్చును. అన్నిటికిని ఇతరులనే నమ్ముకొనుట యెంత న్యాయమో యిదియు నంతే ; రెండును అనుచితములే. మన యనుభవములనే నమ్ముకొన్నపుడు మనయజ్ఞానము మనల నెంత చెఱుచునో, యితరులను నమ్ము కొన్నప్పుడు వారి యజ్ఞానము మనల నంతే చెఱుచును. మనుష్యుఁడు ఏ విషయ మందును కేవల స్వతంత్రుఁడు గాCడు ; పట్టి పరతంత్రుఁడునుగాఁడు; మధ్యవర్తి లేకున్న బ్రదుకు సాcగదు. కావున -

          "క. వినవలె నెవ్వరు చెప్పిన
               వినినంతనె వేగపడక వివరింపపలెన్
               కని కల్ల నిజముఁ దెలిసిన
               మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ,"