పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 94

డనియుఁ జెప్పుకొనెను. *[1]వేమన్న కిట్టి సంకరజన్మకధ లేకున్నను ఆతనికి క్రమ ముగా తల్లిదండ్రులపై నభిమానము నశించినది

           "ఆ, తల్లిదండ్రి మీఁద దయలేని పత్రుండు
                 పుట్టినేమి వాఁడు గిట్టెనేమి?.." (1853)
అని వ్రాసినను, తుదకు
           "ఆ, తల్లి గౌరియగును, తండ్రియా శంభుండు
                 ప్రమథగణము లఖిలబంధు వితతి
                 తనకుఁబుట్టనిల్ల తనరు కైలాసంబు." (1-47)

వేమన్న కాలమైనను మేలు; సర్వజ్ఞనిదింకను చిక్కు, ఒక పద్యములో బసవేశ్వరుని శిష్యుఁడని యున్నది (945). వేరొక పద్యములో ఇంగ్లీషువారు శ్రీరంగపట్టణమును వశపరచుకొన్న విషయమున్నది! (1001) అనఁగా, పండ్రెండవ శతాబ్దము మొదలు పదునెనిమిదవ శతాబ్ధంవరకును ఇతనిజీవిత మన్నమాట! ఇతనిని గూర్చి యొక్కువ పరిశోధనచేసి పద్యములను ప్రకటించిన ఉత్తంగి చెన్నప్ప గారు పదునాఱవ శతాబ్దము వాఁడై యుండునని యూహచేసిరి.†[2] కాని యదియు సాధనములులేని చరిత్రకారుల యూహలవంటిదే కాని, యెక్కువ నమ్మఁదగినది కాదు.

ఇతఁడు తలిదండ్రులను తిరస్కరించె నంటిని. దానికి కారణము వట్టిధోర్త్యమై యుండదు. ఇతని జన్మ విచారమును బేర్కొని, జనులపహసింపఁగా తాను సామాన్య మనుష్య మాత్రుఁడను గానని వారి కితఁడు ప్రతిఘటించి నిలిచి యుండును. 'శూద్ర ప్రజ్ఞలు', 'కావు కవిత్వములు" మనలో ప్రాఁతమాటలేకదా. ఇట్లు జాతినిబట్టి వ్యక్తిని తిరస్కరించువారిపై నితఁడు కత్తిగట్టెను గావననే యిట్లను చున్నాcడు'

               "ముత్తు నీరలి హుట్టి హత్తు సావిర హడగు ;
                హత్తు చిప్పొందు హణమిల్ల; తాయ్తందె
                ఎత్తణవరెంద పర్వజ్ఞ." (1112)

(నీటఁబుట్టస ముత్యము పదివేలుచేయును. అట్టి కప్పచిప్పలు పదివేసినను ఒక రూక చేయవు. తలిదండ్రు లెక్కడిలెక్క ? అన్నాఁడు సర్వజ్ఞఁడు.)

వేమనకువలెనే యితనికిని తనశక్తియం దెక్కువ నమ్మకముగలదు. ఇతని సర్వజ్ఞుఁడను పేరుగూడ తలిదండ్రులు పెట్టినపేరుగాఁ దోcపదు. సర్వజ్ఞుడను బిరుదు గలవారనేకులున్నారు గాని, అట్టి పేరుగలవారి నిదివఱకును నే నెఱుగను. ఇఁక ఇతఁడును పండితుఁడు గాఁడు గావున, ఇతనిశక్తికి మెచ్చి యే ప్రభుపుగాని యాకాలమున నీ బిరుదు నిచ్చియుండcడు. కావున యెవరో యితని ధూర్తపు మాటలు విని

వీcడేమి సర్వజ్ఞ(డా ?' యని యూక్షేపించిరి గాcబోలు. *ఏల కాఁగూడదు?" అని ఆ పేరే యతఁడుంచుకొని పద్యములు రచించి వారి మొగమునఁ బాఱవేయఁ జొచ్చెనేమో! ఇదియే నిజమేని తన పుట్టినపేరు జాతి మార్చుకోcదలపని వేమన్న కన్న సంఘతిరస్కారమున నితఁడొక మొట్టు ముందు పడినాఁడని చెప్పవచ్చును. వేమనవలె నితఁడును చాలవఱ కుద్రి క్తస్వభావము కలవాఁడు. చదువు

  1. * చూ, ప. _2-14
  2. †tచూ, సర్వ. పీఠిక, ప, 39