పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                      వేమన వంటివారు 95

సంధ్యల నిర్బంధమున కెక్కువ లోఁగినవాఁడు కాఁడు. సహజముగా పదనైన కవితాశక్తి కలవాఁడు. హాస్యప్రియుఁడు. 'నక్కునగినువానుడిలేను' (నవ్వి నవ్వించుమాట లెస్స) యని నిర్ణయించినవాఁడు (1236). అట్లే నవ్వి నవ్వింపఁ గలవాఁడు. కావననే ఇహలోకసౌఖ్యమును వేమన్నకన్న నెక్కువ ప్రీతితో తృప్తితో ననుభవించినవాఁడు. వేమన్నయందు చిన్ననాఁటినుండి అతృప్తియను ధర్మము మితిమీరియున్నది. ఇతనియందును గలదుగాని యంతలేదు. అనఁగా, నితడు గొప్ప ధనవంతుఁడుగా నుండెనని కాదు. మనోధర్మము గాని వస్తుధర్మము గాదు, వేమనవలె నితనికిని నేయి, పాలు, పెఱుఁగు, పప్పు మొదలగు సామాన్య వస్తువులమీఁదనే కాక, మినుపవడలు, ఓళిగలు, కజ్ఞాయములు మొదలగు విశేషపు తిను బండములపైCగూడ నాదరము మెండైనను, జొన్నలు, కొఱ్ఱలు, రాగులు మొదలగు ధాన్యములపైనను ఆభిమానముగలదు.*[1]ఇతని సంసారలక్షణ మేమనఁగా వెచ్చని యిల్లు, వెచ్చమునకు డబ్బు, రెండెద్దులు, ఐదుగురు కొడుకులు (?), వట్టిపోని ఆవులు, వెనుదీయక పనిచేయుకోడలు, ఒక ముసలి యవ్వ, తన యిచ్చనెఱుఁగఁగల గుణవతియగు భార్య-ఇవి యున్నచో 'స్వర్గక్కెకిచ్చు హచ్చెంద సర్వజ్ఞ (పే. 267). స్వర్గమునకు నిప్పంటించు మన్నాఁడు సర్వజ్ఞCడు. అనఁగా, నితడు వేమనకంటె బుద్ధిమంతుఁడై యేక పత్నీవ్రతమును మర్యాదగా పాలించి బ్రతికినవాఁడని యూహింపకుఁడు. అతనివలె నితఁడును జారస్త్రీలు, వేశ్యలు మొదలగు వారికి లోపడుటయేకాక, ఆ ప్రపంచమున నతనికన్న నొకచేయి యొక్కువగానే పోరాడినవాఁడని చెప్పవలసి యున్నది. ఎట్టివారు జార స్త్రీలను విషయమును తెలుపుటకితఁ డనేకపద్యములు వ్రాసినాఁడు (1664-1771) . స్త్రీవశీకరణమునకు తక్కిన వేఱువెల్లఁకులేమియుఁ బనిలేదంట. బంగారువేఱుచే వారు తప్పక స్వాధీనమవదురcట ! (1628) ఇట్లే వేశ్యల గూర్చియు పలుపద్యములితఁడు వ్రాసెను (పే.289). వారి విషయముగా నొక్క మంచిమాటయైనను వ్రాయలేదు సరిగదా, మీఁదుమిక్కిలి వట్టిమాటలచే వారిని మరులు కొలిపి డబ్బీయక దగాచేసినవాఁడే జాణయనియు నొకచోటఁ జెప్పినాఁడు ! (1766) కాని యీవర్తనము అనుచితమని యితఁడెఱుఁగును. ఇతరులకట్లే బోధించెను. నిజమైన సుఖమేదనఁగా -

                "జోళూ బోనాగి మేలె కెనె మొుసరాగి
                  వేళగె బరువ సతియూగె, సూయను
                  కోళ దిక్కెంద సర్వజ్ఞ" (1559)

జొన్నన్నము, మీఁగడపెరుగు, వేళకువచ్చుసతి–ఇవియున్నచో వేశ్యను కొఱత వేయుము-అని యర్ధము. అవి లేనప్పడు వేశ్య పనికివచ్చునని తార్పర్యము!

ఇట్టి తృప్తిగల స్వభావము గలవాఁడు గావుననే, వేమనవలె అడుగడుగు నకును బ్రహ్మను దిట్టక, మనకు తెలియని విషయములను గూర్చి చింతించి, మనకు సాధ్యముగాని కార్యములను సాధింపఁ బ్రయత్నించి, అవస్థపడుటకన్న 'శివతోరిదంతిహుదె లేను సర్వజ్ఞ'-శివుఁడు చూపినట్లుండుట లెన్స-యను కొన్నాఁడు (815)

 1. * చూ, లేసుపద్దతి, ఆన్నపద్దతి,