పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 58

మమష్యునికిని సమానమైనను ఈ బంధ మొక్కటి యితని కెక్కువగాఁ గలిగి, తక్కినవానికున్న నైశ్చింత్యసుఖమును ఇతనికి లేకపోయి, బ్రదుకు నహింపరాని దైనది. నాఁటినుండి నేఁటివఱకును మానవజాతి ప్రయత్న మంతయు ముఖ్యముగా పై యజ్ఞాన బంధమునుండి తమ్ము వదలిచుకొనుటకే వినియోగమగుచున్నది. ఈ సహజమైన ముక్తికాంక్ష నాకస్మికముగా వదలుటకు ఆధునికులందరు తటాలున పశువులో పశుపతులో కాలేరు గదా ! ఆ బంధమట్లే యున్నది. తెగలేదు. తెంచు కొను ప్రయత్నములును నిలువలేదు. కాని తెలిసికొనుటకు వేఱుమార్గము వెదకు చున్నారింతే. ప్రాచీనులు సర్వసందిగ్ధమైన యీ సృష్టిని సముదాయముగాఁ బరీ క్షించి, ప్రతివస్తువునందును గలుగు సందేహమును ప్రత్యేకముగాఁ దీర్చుకొనుట యసంభవముగా నెఱిఁగి, ఈ విచిత్ర వైరుధ్యమునకు మూలకారణమొకటి యుండ వలయునని నిశ్చయించి, తమ ప్రయత్నమంతయు నాప్రక్కకుఁ ద్రిప్పి పనిచేసిరి. ఫలమేమనఁగా, ఒక్కొక్కరి యూహయు అనుభవమును వేఱు వేఱు కారణములచే వేఱువేఱుగా నుండుటచేత, ఆ మూలమూర్తి యొకటియైనను ఒకవిధముగా నుండక, పలువిధములుగా మాఱి మనకష్టమును మఱింత హెచ్చించినది. అది సగుణమని కొందఱు, నిర్గుణమని కొందఱు, శూన్యమని కొందఱు, రెండును గానిదని కొందఱును తలంచిరి; బోధించిరి. ఇ(క సగుణమూర్తియని యంగీకరించిన వారిలో నెన్ని సిద్ధాంత భేదములు ? దాని యాకారము, లింగము, వన్నె, అవయవములు, గుణము, భాష మొదలగు దేనియందును ఒకటివలె నొకటిలేని వేఱువేఱు రూపము లా మూలమూర్తికి వచ్చిసవి. ఇట్లు చెఱసాల వదిలిరావలయునని ప్రయత్నించి వాకిట కాలుపెట్టఁగనే ఉన్ననంకిళ్ళు వదలుట యట్లుండ క్రొత్తసంకిళ్ళు వచ్చి నట్లయ్యెను ! అన్ని బంధములకన్న పెద్దబంధము మోక్షమే యయ్యెను! కావున నీమార్గము ఫలములేదని ఆధునికులగు పాశ్చాత్యులును వారి నాగరకత ననుస రించినవారును, కంటికిఁ గానవచ్చు పదార్ధము నొక్కొక్కదానిని ప్రత్యేకముగ పగుల( గొట్టి యంగాంగములు పరీక్షించి, దాని గుణనియమాదులను గనిపెట్టి, ఆ పదార్థ విజ్ఞానమూలమున సృష్టి రహస్యపులోఁతునుచూడఁ బ్రయత్నించుచున్నారు. కాని యిబావిని ద్రవ్విన ల్లెల్లభూతములు బయలుదేరుచున్నవి ! ఈ యిసుకపాతర కంతేది? మరియు నెన్నఁడును మనుష్యుని చేతికందని, కొలఁతకుఁ జిక్కని పదార్థములు ఖగోళాదులు కోట్లకొలదిఁ గలవు. వానిని చెలిసికొనుట కనుమానము తప్ప వేఱేమిమార్గము ? కావుననే సూర్య చంద్రాదులనుగూర్చి ఆధునికుల యూహలు వింతవింతలుగా బయలుదేరుచున్నవి. ఇంతకష్టపడి మనుష్యజాతి బ్రతికినన్నాళ్ళు పరీక్షించి పరీక్షించి, తమ సంపాదించిన జ్ఞానమును వ్రాసిపెట్టినను, తదియే వేఱొకసృష్టి యంతయై, యొక మనుష్యునికే కాదు, అందఱుఁజేరినను జీర్ణించుకొన వీలులేనంత యైపోవును గాన, ఇందుచే బ్రతుకు మరింత కష్టమే యగునేమో ! మఱియు, ఇట్లు పస్తువులను ప్రత్యేకముగా పగులఁగొట్టి పరిశోధించుట చేత, ఇదివఱకును మన మెఱుంగనివాని యందలి శక్తులు కొన్ని యొఱుఁగగలము : వాని నుపయోగించుకొని బ్రతుకులో కొన్ని యనుకూలములను కల్పించుకొనఁ గలము : “ఇది యెట్లు ?" అని యడిగిన కొంతవఱకును జవాబియ్యఁగలము. ఇది యొక విధమైన చిన్న మోక్షము. ఇంతే కాని యీ ప్రపంచమేల యిట్లు జరుగు చున్నది? దీనికి మూలమేమి? ఇత్యాది ప్రథమ ప్రశ్నలకు ప్రతిధ్వని తప్ప వేఱు పత్యుత్తరము గలదా? ఇట్లు ఆధునికులు మోక్షమును సంపాదించుటకై వేఱు