పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాలమందలి మతధర్మముల స్థితి 59

మార్గమునఁ బ్రయత్నించి ప్రాచీనులవలె తుదకు బద్ధులే యగుచున్నా రింతేకాని వారు మోక్షద్వేషులు గారని చెప్పవచ్చి చాలఁ బెంచితిని.

ఈ మోక్షదృష్టియే ప్రాచీనులను ధార్మికులనుగాను, ఆధునికుల నార్ధికులను గాను జేసినది. పరలోక సుఖము వారి పరమార్థము, ఇహలోక సుఖము వీరి పరాయణము గాఁ బరిణమించినవనుట వేఱుగా చెప్పఁబనిలేదు.

వేమన యిట్టి ధార్మికులగుంపులోఁ బుట్టినవాఁడు. అతని కాలమునకు చాలనాళ్ళక్రిందనే మనలో మోక్షధర్మములు వేణువేఱుగా స్థిరములై యేర్పడినవి. వాని సత్యమును సందేహించుటయే పాపమని తలఁపఁబడెను. మరియు, ప్రత్యేక వ్యక్తులకు సంబంధింపవలసిన, అనఁగా, ఎవనియంతకువాఁడు పరీక్షించి నిర్ణయించు కొనవలసిన, మోక్షధర్మములు సంఘమునకుఁజేరి ఆ సంఘము వారందఱును వాని యధికారమునకు లో పడవలసి వచ్చుటచేత, తమ స్వతంత్రబుద్ధి నుపయోగించు దైర్యమే ప్రజలకు నశించియుండెను. ఏ జాతిలోఁ బుట్టినవాని కాజాతిలో పెద్దలు నిర్ణయించిన ధర్మమే నత్యమైన మోక్షపథమని నమ్మట, ఇతరమతములు నీచ ములు అసత్యములని తిరస్కరించుట, పై రెంటిని సాధించుటకుఁ గావలసిన తర్కశాస్త్రకౌశల్యము సంపాదించుట-ఇవి చిన్ననాఁటినుండి మనుష్యులకు నేర్పఁ బడుచుండెను. ఇందుచే భుక్తి గోరి సంభవించు రాజకీయకలహములకన్న ముక్తిని నిర్ణయించు మతకలహములే ప్రబలములై సంఘము నావరించి, దేశము నన్యా క్రాంతముచేసి, పరలోక మోక్షమెట్లున్నను, ఇహలోకబంధము ముడిని మరింత బిగువు చేసెను.

ఆ కాలమందు మనదేశమున వ్యాప్తిలోనుండిన ప్రధానసిద్ధాంతములు రెండుద్వైతము, అద్వైతము. బహుదేవతావాదులైన జైనులు ఆంధ్రదేశమును చాలనాళ్ళ క్రిందనే వదలిపోయిరి. వారాంధ్రదేశమందు మతవ్యాప్తి కెక్కువ ప్రయత్నించిరా యను విషయమే సందిగ్ధము. శూన్యవాదులైన బౌద్ధులన్ననో భరతఖండమందే నిలువ నీడలేక వలసపోయిరి. పాపమిఁక ఇట్లు తలకందని విషయములకై తగవు లాడలేక, కన్నులకుఁ గానవచ్చినదే సత్యమనియు, తక్కిన దంతయు మిథ్య యనియుఁ దలంచి, 'అప్పుచేసియైనను, నేయిత్రాగి చావవలయు’ నని నిర్ణయించిన సుకుమారబుద్ధులు చార్వాకులు, అన్నిమతములవారికిని శత్రువులై బ్రదుకుదెరువు గానక యంతర్ధానమైరి.. సృష్టిచేసినవాఁడు, సకలకల్యాణ ఈ చరాచర ప్రపంచ మును వినోదమునకై గుణములచే నింపినవాఁడు,దుర్గుణ శూన్యుఁడు; దీనిని రక్షించు వాఁడు; తుదకు తన కిష్టమువచ్చినప్పడు ధ్వంశముచేయువాఁడు నగు చేతన మూర్తి యొకఁడు గలఁడనియు, అతని నారాధించి భక్తిచే ప్రనన్నుని జేసికొంటిమేని తనలీలా సృష్టి యందలి బంధములను దప్పించి, మనలను తనవంటి నిర్ద్వంద్వులనుగాఁజేసి, తనవద్ద స్థిరముగా నుంచుకొనుననియు, అదే మోక్షమనియు, సగుణబ్రహ్మవాదులగు ద్వైతులుతలఁచిరి. వీరికి విరుద్ధముగా బ్రహ్మమొక్కటే సత్యమనియు, తక్కిన నామరూప విశిష్టమగు ఈ చరాచర ప్రపంచమంతయు మిథ్యయనియు, బ్రహ్మకే యొక్కొక్కమా ఱు మాయ యావరింపఁగా, ఇట్లు వేఱువేఱు గుణరూపములు గలిగినట్లు గానవచ్చునే కాని, యది నిర్గుణమనియు, కావున ప్రతివస్తువును మాయా వృతమైన బ్రహ్మమే యనియు, ఇట్లు 'నేను బ్రహ్మను అనుజ్ఞానమును సంపాదించి అవినతముగా అట్లే ధ్యానము చేయుచుండిన న్యాయభేదానుభవము గలుగుననియు, అదే మోక్షమనియు, నిర్గుణైక బ్రహ్మవాదులగు అద్వైతులు తలఁచిరి. కాని యీ