పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన. 52

మోనము మొదలగునవి లేనిదనుట. తప్పో యొప్పో తలఁచినది తలఁచినట్లుగాఁ జెప్పి, చెప్పినట్లుగా జేయు త్రికరణశుద్ధి గలవాఁడన్నమాట

       "ఆ. మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగ యౌ
             నేటి ప్రాణమింక బ్రదుకు !
             మాట నత్యమైన మణి శతాయుష్యంబు..." (3206)

కనుక ఈ మార్గముతో ద్రవ్యమార్జింప సాధ్యముగాదు. కాని తనది ప్రపంచ సంసారము ; పథము జరుగుట యెట్లు ?

ఈ సందర్భమునందే కా(బోలు ఇతనికి చౌకలోహములను వెండిబంగారులుగా మార్చు రసవాదవిద్యపై మనసు పోయినది. ఇనుము, ఇత్తడి, రాగి మొదలగు లోహముల పాత్రము లెంత బీద సంసారమందైన నుండును. వాని నెల్ల బంగారుగా మార్పఁగల్లినయెడల నీ తిరి పెపుతంటా లుండవు కదా ! ఇందుకై యితఁడు వాద గ్రంథములు కొన్ని చదివియుండును. ఏ బైరాగులనో, కంసాలులనో యాశ్రయించి యుండును. ఎట్లును అనేక రసవాదయోగముల నితఁడు స్వయముగా చేసి చూచి నాఁడు. ఇంతేకాదు, ఆ విద్యలో సిద్ధినిగూడ బొందినట్లున్నది. కాని “యతఁడు సాధించిన సిద్ధిస్వరూప మెట్టిది? పై లోహములకు బంగారపుతూకము, వన్నె, మార్ధవము మొదలగు గుణములన్నియు పూర్తిగా వచ్చునట్లు చేయగల్గెనా ? లేక వన్నె మాత్రము గలిగించి తాను వంచితుఁడై లోకమును వంచించెనా ?" యను ప్రశ్నలకు సమాధానము నే నీయఁజాలను.

ఇఁక నీ రసవాదవిద్యయే మిథ్యయని, మోసమని భావించి, వేమన యీ పద్యములు వ్రాయనేలేదని నమ్మి యానందముతో నుండువారు ధన్యులు. కాని నాకంత నెమ్మది లేదు. ఈ విషయమును బోధించు అనేక పద్యములలో వేమన్న యొక్క యనన్యసులభమైన శైలి ప్రతి పదమునందును తాండవమాడుచుండును.

       "ఆ, బింబలములుండ దిగువైన
             ఫరసముండ పసిఁడి కొఱకు తిరిగి పాట్లుపడిరి
             సత్తు వెచ్చ(బేసి సాధింపలేరొకో... " .(2749)

       "ఆ. ఇంగిలీక మహిమ హేమించనేరక
             చిత్రపటమువ్రాసి చెఱచినారు ;
             బొంతజెముడు పాలఁ బొంగించ నేరరు..." (339)

ఇత్యాదిపద్యములు వేమన్నవి కావనువారిని, మఱలనొకమాఱు వేమన్న పద్యము లన్ని చదివి యామాట చెప్పుఁడని వేఁడుచున్నాను. అస లీవిద్య మిథ్యయని యేల యనుకొనవలెను ? పాశ్చాత్య శాస్త్రముల కిది తెలియదనియా ? లేక మనలో నిప్పు డెవరును చేసి చూప్పువారు లేరనియా ? మొదటి పక్షమున తూర్పు వారెఱింగి పడమటి వారెఱుంగని విచిత్రవిద్యలు లేవా? ఈజిప్టువారు వేలకొలఁది యేండ్లు పీనుఁగులను క్రుళ్ళిపోకుండ భద్రముగా పెట్టెలలో దాఁచియున్నారే పాశ్చాత్యులకు దాని రహస్య మర్ధమైనదా ? మనలో సామన్యయోగులు నిరాధానముగ నంతరిక్షమందు నిలుతురే (ఇది నేను పత్యక్షముగాఁ జూచినది); అది యేపాశ్చాత్త్య శారీరకశాస్త్ర ప్రకారము సాధింపవచ్చును? కరఁగిససీసము కాలకూటవిషము మొదలగు పదార్థములను గిన్నెలకొలఁది గటగట తాగి జీర్ణించుకొన్న 'స్వామిసీతారామ్జీ" యను అద్భుతశక్తి గలవాఁ డిప్పుడును ఉన్నాఁడు గదా! వేలకొలఁది జీతములదిను పాశ్చత్యవైద్యులు, ఏదీ దాని రహస్యమును బైటఁబెట్టనిండు.ఇఁక మనలో వట్టిశాస్త్రములు చెప్పవారే