పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                    వేమన సంసార స్థితిగతులు 53

కాని చేసి చూపవారు ఇప్పడు లేరనుట చాలవఱకు సత్యము. అది యిప్పటి మన సర్వదరిద్రావస్థ. కాని యిదియొక రసవాదముందేనా? గోమఠేశ్వరునివంటి అఱువది యడుగుల యెత్తగల యేకశిలా విగ్రహమును దీర్పఁగలవారు మనలో నేఁడున్నారా? చుట్టుప్రక్కల నామడల కొలఁది చూచినను అఱచేతి వెడల్పురాయి దొరకక, బట్టలుతుకుటకుఁగూడ చెక్కపలకల నుపయోగింపవలసిన దేశమందు, శ్రీరంగపు దేవళమువంటి విచిత్రవిశాల శిలామయమైన మహెూన్నత మందిరమును మన ప్రాచీనులు నిర్మించిరిగదా? నేఁటి మనకు కలలోనైన నా శక్తి సాధ్యమని తోఁచునా? ఈ కారణముచేత పైఁజెప్పినవన్నియు మన బ్రాచీనులు చేసినవి కావని తలఁపలేము.

ఇఁక నీ విద్య సత్యమని చెప్పటకు నీకేమి యాధారమందురేమో ! సత్యమని నేను జెప్పలేదు; సత్యము కావచ్చునన్నాను. కారణము ఈ స్వర్ణవాద యోగములను దెలుపు అసంఖ్య గ్రంథములుండుటయే. వానిని వ్రాసిన వారందఱును వంచకులని కాని, బ్రాంతులని కాని చెప్పఁజొచ్చుట సాహసము. నా కంతటిదైర్యము లేదు. ఇది గాక ఈ విద్యను సాధించుటకై అనేక సంవత్సరములు వ్యయప్రయానములకు లోనై కొంతవఱకు దాని మర్మముల నెఱిఁగినవారు-పూర్తిగా దానిని తాము సాధింప లేకున్నను, సాధించినవారు ప్రత్యక్షముగా నిస్సంశయముగా రసము మొదలగు వానిని బంగారముగా మార్పఁగా కన్నులారఁ జూచినవారు-కపటవంచనాదులులేని నిష్క ల్మష చిత్తులు—ఆగు కొందఱిని నేనెఱుఁగుదును. కావున యిప్పటి పాశ్చాత్యుల యజ్ఞానముగాని, మన యజ్ఞానముగాని ప్రాచీనుల యజ్ఞానమును స్థాపించుటకు చాల వని నా మనవి. ఇట్టిసందిద్దవిషయములలో లేదనుకొనుటకన్న ఉండవచ్చుననుకొను టయే యుత్తమమార్గము.

మఱియు, ఇందఱు ఆధునిక రసాయనశాస్త్రజ్ఞులలో నల్లవారైనను, తెల్లవా రైనను ఎవరుగానీ, పాశ్చాత్యుల సిద్ధాంతముల ప్రకారము, ఆ గురువుల యుపదేశము ప్రకారము, వారి పద్ధతులనే యవలంబించి లక్షలకొలఁది వెచ్చించి పదార్థపరీక్షలు యుచున్నారే కాని, ఇట్టి యోగములను చక్కఁగాఁ దెలిసికొని పరీక్షించి సత్య మును బైలుపఱుపవలెనని పరిశ్రమించు వారేరి? పాశ్చాత్యపద్ధతులకై దిక్కుదిశ లేక కోట్లకొలఁది వెచ్చించు ' తాతా ఇస్స్టిట్యూటు' వంటి శాస్త్రపరిషత్తవారిట్టి విషయ ములకై యేలప్రవేశించి పనిచేయరాదు? ఇట్టి విషయములను మనవారివద్దనుండి తెలిసికొనుట చాలకష్టమనియు, సామాన్యముగా వారుచెప్పరనియు నేనెఱుఁగుదును. అర్థముకాని యప్రయోజకములైన మనవారి సంప్రదాయములలో నిదియొకటి. మన శాస్త్రములకు పట్టిన పెద్ద చీడపురుగది. కాని సత్యాన్వేషకులని పేరుపెట్టుకొన్న వారిట్టి విఘ్నముల నెదుర్కొనలేకపోవట, అది కారణముగా అసలే లేదనిచెప్పి యజ్ఞా నానంద మనుభవించుట, క్షమింపరాని దోషములు. ఇట్టివారి పేఁడిమాటలకు మందొకటే- ఉదాసీనము.

మఱికొందఱిరసవాద పద్యములకు వేఱువిధముగా అపార్థములుచేయుదురు. ఈ క్రింది పద్యము వినుఁడు :

       "ఆ. ఉప్పు చింతపండు నూరిలో నుండఁగా
             కరువదేల వచ్చె కాఁపులార
             తాళకం బెఱుఁగరొ తగరంబు నెఱుఁగరో..." (536)

దీనికి రసవాదజ్ఞ లొకరిట్లు అర్థము చెప్పిరి-"తాళకము అగ్గిసెగకు నిలువని వస్తువు. దానికి ఆగ్నిజయమును గల్గించి భస్మముఁ జేసిన నది స్వర్ణయోగ సాధనము