పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ:

మూడవ యుపన్యాసము

వేమన సంసార స్థితిగతులు

ఇదివరకును వేమనవంశము, కాలము, దేశము-వీనినిగూర్చి కొంత వఱకును ఎక్కువ ఫలములేని చర్చ జరిగినది. ఇఁక నతని సంసార స్థితిగతులను గూర్చి యేమైన నెఱుఁగఁగలమా యని చూతము,

ఈ విషయమును గూర్చి చర్చింపఁ దలంచిన వెంటనే వేమన యింకేదో నన్ని వేశమున చెప్పిన యీ క్రింది పద్యము జ్ఞప్తికి వచ్చుచున్నది--

      "ఆ, నతులు నుతులు మాయ, సంసారములు మాయ,
            ధనము మనము మాయ, తలఁప మాయ.
           తెలియనీదు మాయ, దీనిల్లు పాడాయ, విశ్వ."*[1] (3834)

మనపాలికిప్పడు వేమన సతీనుతులు, సంసారము, సంపాదించిన ధనము, ఘనత, చదివిన చదువు—ఇవన్నియు నిర్ణయించు సాధనములు లేక 'మాయ' గానే కానవచ్చుచున్నవి. ఇట్టిచో లేనివి కల్పించుటకుఁగాని లేవనుకొని యూరకుండు టకుఁ గాని యిష్టము లేనప్పడు, ఉన్న యాధారములనుబట్టి యూహించుటయు కొంత తృప్తిని గలిగించును. ఆ యాధారములు వేమన పేరిటి పద్యములలో నతనివేయని నమ్మట కనుకూలమైనవి. వానిలో ఆకస్మికముగా చేరిన కొన్ని యంశములనుబట్టి పై విషయములను మనము కొంత నిర్ణయింపవచ్చును.

కాని, కవుల గ్రంథములందలి వ్రాఁతలనుబట్టి వారి చరిత్రమును నిర్ణయింప సాధ్యమా ? అట్లైనచో ఆంధ్ర వాజ్మయమందలి కవులెందరికో ఇష్టదేవత స్వప్నమున వచ్చి గ్రంథకరణమును యాచించె ననవలసి యుండును; ఎందఱికో, యేమియు వ్రాయకమునుపే, గ్రంథభర్తలు జాంబూన దాంబరాగ్రహారాదులు సంచకారమిచ్చి నా రనవలసి యుండును; ప్రతి ప్రభంద కవియును మూతులుంగలుంగలవంగ ములు మొదలగు తల తోకలేని మహీరుహమాలికలతో తిద్ధి తీర్చిన యూరామ మందు, మల్లెమొల్ల జాజి సంపెంగల పొదల నడుమ, గొజ్జఁగి నీటికాలువలు పూఁదేనియ సోనలు నావరించియున్న చంద్రకాంతశిలావేదికలపై, పుప్పొడుల మెత్తలపైఁ బరుండియే కవితా కాలక్షేపమును జేయుచునో, లేక మధ్యాహ్నపు వంటకు మార్గము నెఱుఁగని యిల్లాలితో కలహించుటచే విరహమున కోర్వఁజాలక చంద్ర మలయమారుతాదులను దూషించుచునో, ప్రాద్దుగడపచుండెననవలసి యుండును ! ఇట్లు ఇల్లాలిముక్కరకొకముత్యము గతిలేకున్నను, ఇంటిముంగలి

  1. * పైపద్యపు మూఁడవ పాదము (314) పద్యముది, వేమన పద్యములలో పెకి-ంటికి దేని పాదము దేని కతికించినను అచ్చుగాని ఆందముగాని చెడదు గావున విట్లు ఆనుకూల్యముకొఱకు మార్చఁబడినది.