పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 37

వీధులకెల్ల ముత్యాల ముగ్గులు పెట్టువారు మనకవులు. పారి వ్రాఁతలనుబట్టి వారి సంసారస్థితిగతులను నిర్ణయించుట ప్రమాదము గదా ! యని యాక్షేపింప వచ్చును.

నిజమే, కాని వేమన యాతీఱు కవిగాఁడు, పొట్టపోసికొనుటకు, పరుల పొగడింతలకు వేకారికాని, పరుల ఖండనలకు వెఱచికాని యితఁడు పద్యములు వ్రాయలేదు. స్వానుభవ మితనికవిత్వమందలి జీవగుణమని మొదలే విన్నవించితిని. ఇతరాశలకు లోపడి పద్యములు వ్రాయువారిని

       "ఆ, తోఁట కూరకైనఁ దొగ్గలికైనను
             తమిఁదకుడుముకైన తవటికైన
             కావ్యములను జెప్పుగండ్యాలు ఘనమైరి విశ్వ." (1986)

యని తిరస్కరించి మొగము ద్రిప్పకొన్నవాఁడు. కావున ఇట్టివాని వ్రాఁతలను బట్టి యతని పూర్వోత్తరముల నూహించునప్పడు మనము మన భావనాశక్తికి స్వేచ్ఛాచార మిచ్చుటకు వీలులేదు.

వేమన కాఁపువాఁడు; కాఁపులలోను రెడ్డి, అనఁగానే 'వడ్లలో నెన్ని భేద ములో రెడ్లలోనన్ని కలవుగావున ఇతఁడే రెడ్డి?' యని చెక్కితీర్చిన చరిత్రకారుఁడు లేచి ప్రశ్నించును. కాని యాచర్చ నతనికే వదలిపెట్టెదను. ఎందుకనఁగా, అంత కన్న నెక్కువ విభాగము వేమనకే అవశ్యకముగఁ దోcపలేదు, మరియు తాను ' రెడ్డి' యని యొక్కడనో యొకటి రెండు చోటులఁ దప్ప తక్కిన స్థలములందెల్ల తాను వట్టి 'కాఁపు" నని చెప్పటయందే యతని కభిమానమెక్కువ.

       "ఆ. కలి యుగమున నున్న కాఁపు కులానకు
             వేమన తనకీర్తి విక్రయించె." (995)

అని మాత్ర మతఁడు చెప్పకొని సంతోషించెను! తక్కిన యన్ని కులములకంటె నీ కాఁపు కులముపై నితని కభిమానమును దయయును నెక్కువ గాఁగలదు—

       "ఆ. కాcపకులజులెంత కర్ములైనను గాని
             పాపరాశి కొంత పరిసి పోవు
             వివర మెఱుఁగనట్టి వెఱ్ఱిజీవులుగాన, విశ్వ." (ఓ.లై, 13-5-31)

మనదేశమునందు మొదటినుండియు ధనధాన్య నంపదగలిగి, శార్యౌదార్య ములకు పేరైనజాతులలో ఈ కా(పురెడ్లు ముఖ్యమైనవారు. మొదలు స్వతంత్ర ముగ రాజ్యముచేసి, తరువాత విజయనగరపు రాజులు మొదలగువారి చేతిక్రింద పాళయగారులుగాను అధికారులుగాను ఉండి, ప్రధాన రాజ్యములు నశించిన పిమ్మట వీరెక్కడి వారక్కడ స్వతంత్రులై వర్తించినవారు. సహజమైన స్వాతంత్ర్యాభి మానము, కాయశక్తి పరంపరగా వచ్చిన రాచరికపుఠీవి, స్నేహసాహసములు గలవా రగుటచేత, వీరెందున్నను జనులు వీరియెడ భయభక్తులు గలిగి వర్తించుట సహజము. దీనికితోడు స్వదేశాభిమానము, స్వదేశీయాభిమానము మొదలగు ఉదా రాశయములను బెంపొందించు చదువునంధ్య లెక్కువగా నేర్చియుండిరేని భరత ఖండమునకు వీరిచే నెంత యౌన్నత్యము లభించుచుండెడిదో యూహింప నసాధ్యము, ఆట్లుగాక సైనికధర్మ మొక్కువగలిగి సేనానీ ప్రతిభాసంస్కారములు చాలని వారగుటచేత సామ్రాజ్యమును స్థాపించు ప్రాచీనశక్తిని గోలుపోయినను, తామన్నచోటనే చిన్నపల్లె రాజ్యమును స్థాపించి తక్కినవారికి సామాన్యముగ లొంగక వర్తించుట వీరి స్వభావమైనది. మంచి చెడ్డలకు రెంటికిని లక్ష్యము లేక