పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కవిత్వము, హాస్యము, నీతులు 127

                "ఆ. మేనమామబిడ్డ మెరసి పెండ్డామాయె
                      అరపలందు చెల్లెలాయెసదియు,
                      వలసిన పుణ్యంబు వలదన్న దోషంబు..." (ఓ. లై.,13-4-10)

మనుష్యులకు సహజముగా ఇతరుల దుఃఖమునకు దుఃఖించుట, సుఖము సంతోషించుట, యను నుదారగుణములును గలవు. కావున అట్టి దుఃఖమును గొట్టి సంతోషమును గలిగించుటచే తనకుఁగలుగు సంతోషమే పరోపకారమందలి మార్ధము. ఇదిగూడ స్వార్ధమేకదా యను సూక్ష్మతార్కికుల వాదముతో మనకు లేదు.

ఇట్టి పరార్థ కార్యములలో వేమన్న కెక్కువ యభిమతమైనది ఔదార్యము. ఇతరులు తన్ను యాచించుటకు ముందెదానముచేసినవాఁడె దాతయని యితని ప్రాయము. ఈ విషయ మందితడు అతివాదియని వెనుకనే విన్నవించితిని ? కావుననే యతనికి లోభివారిమీద చాల అసహ్యము పట్టినది. సాధ్యమైనచో ప్రపంచమందలి లోభులనెల్ల పట్టిచంపినను పాపము లేదని యితఁడు తలయున్నది. వారిని చంపుట కితని మందు.

                "ఆ. లోవానిఁ జంప లోకంబు లోపల
                      మందువలదు, వేఱుమతము గలదు,
                      పైక మడిగినంత భగ్గున(బడి చచ్చు." (3400)
ఇంత యసహ్యమునందును హాస్యములేకపోలేదు. ఇంకను వినుఁడు:
                "ఆ. పిసినివాని యింటఁ బీనుఁగు వెడలిన
                      కట్టె కోలలకును కాసులిచ్చి
                      వెచ్చమాయె ననుచు వెక్కి వెక్కేడ్చురా..." (2526)

ఇంత యుదారబుద్దియున్నను వేమన్నకు పాత్రాపాత్రవివేకము లేకపోలేదు. కేమున ఎవఁడు పాత్రము అని నిర్ణయించు నప్పడు ఇతనికి కులము, జాతి మొదలగు వానిమాట యట్లుండనిండు, గుణముగూడ నక్కరలేదు. ముఖ్యమైనది పేదఱికము. అదియున్న తక్కిన వేమున్నను లేకున్నను ఆతఁడు పాత్రమే.

                "ఆ. దోసకారియైన దూసరికా డైన
                      పగతుఁచైస వేదబాహ్యుడైన
                      వట్టిలేని పేదవాని కీఁదగు నివి
                      ధనికునకు నొసంగవలదు వేమ" (2095)

అన్నదానమునుగూర్చి యీతని మతము మొుదలె ఎఱిగితిమి తరువాత వీనికి కన్యాదానముపై నితని కభిమానమెక్కువ. స్త్రీప్రజ యిప్పటికంటె పూర్వ కాలమందు తక్కువ యని కానవచ్చుచున్నది. మఱియు బలవంతులగు మనవారు పలువురు బహుపత్నీత్వము నాశ్రయించి యుండిరి. కావున యా కాలపు మగవారు పెండ్లికైపడు కష్టములకథలు పూర్వకాలమువారిప్పుడును వింతగా చెప్పుదురు.అప్పటి పెండ్లి కన్యాదానము. ఇప్పడది వరదానముగా పరిణమించి అనగా, వరదక్షిణలు మొదలగుసవి యపేక్షింపక ధర్మబుద్ధితో పెండ్లిచేసికొన్న వారికి; లేనివారికి వరవిక్రయమే. ధర్మశాస్త్రములు వ్రాయుకాలము పోయినది లేకున్న, ఏమియు వరదక్షిణ లాశింపక పేదల యింటిపిల్లను పెండ్లి చేసికొన్న రికి జన్మాంతరమందు త్రిలోకాధిపత్యము వచ్చుననియు, వరదక్షిణ లోయలోని తిరస్కరించువారికి ఆ చంద్రార్కము అన్ని నరకబాధలును ఏక కాలనునఁ