పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 128

గలుగుచుండు ననియును, నేనిప్పడు శాస్త్రములు వ్రాసి పరాశరుల పేరు పెట్టియందును. ఇప్పటి యాఁడుబిడ్డల తండ్రుల కష్టమును, కొడుకులుగన్న తండ్రుల కొవ్వును, దేవుఁడు చూచుచున్నవాఁడేని నేను ధర్మశాస్త్రము వ్రాసినను వ్రాయ కున్నను పై ఫలములతఁడు తప్పక యియ్యవలసి యున్నది. వేమన కాలమందిది విపరీతముగా నుండెను. ఐశ్వర్యవంతు లెట్లోతమయిండ్లకు భార్యలను కోడండ్రం , తెచ్చుకొనుచుండిరి. కాని పేదలకు పెండ్లయగుట కష్టముగా నుండెను. కావుననే యీ దానముగూడ ధనవంతులకు చేయరాదనియు, పేదలకే చేయవలయుననియు వేమన శాసించెను. ఇట్లుచేయుట ధర్మమే కాదు, ఇందుచే సుఖమును గలదు--

              "ఆ, కలిమిఁజూచి యియ్యఁగాయమిచ్చినట్ల
                    సమునకియ్య నదియు సరసతనము
                    పేదకిచ్చుమనువు పెనవేసినట్లుండు." (988)

నిజముగా పరుల కుపకరింపవలె సను జ్ఞానమున్నవానికి పరులను పీడింప రాదనుభావము వెంటనే యుండును. ఈ యహింసా ప్రతముపై వేమన్నకు చాల ప్రీతి:

              "ఆ. జీవి జీవి(జంప శిపుని జుపుటె యగు
                    జీవఁడరసి తెలియ నివఁడె కా(డె...." (1625)

కావుననే యితఁడు యజ్ఞకర్మములను చాల నిందించెను. స్పష్టముగా హింన కానవచ్చుచున్న ఈ యజ్ఞములను జైనులు, బౌద్ధులు మొదలుగా నందఱున మొదటినుండియు ఖండించిరి.

                  "యువం కృత్వా పశూస్ హత్వాకృత్వారుదిర కర్దమమ్
                    యద్యేవం గమ్యతే స్వర్గే నరకే కేన గమ్యతే!"*[1]
                                                                   (తిలకమంజరి పీఠిక పు.4)

అని ధనపాలకవి యఱచెను. వైదిక కర్మము లందు శ్రద్ధాభకులుగల బ్రాహ్మ ణులలోనే మాధ్వులు ప్రత్యక్షముగా పశువును జంపుటు వదలి, పిండితో పశువును జేసి కార్యము నెఱవేర్చుచు, అహింసాధర్మమున తక్కినవారికంటె నొక మెట్టు ముందుపడిరి. శ్రీవైష్ణవులలో తెలగలవారు యజ్ఞము లనావశ్యకములని త్రోసి వైచిరి. తక్కినవారిలో యజ్ఞములు చేయువారే యపురూపమైనారు. కాని శాస్త్రమునకేమో యజ్ఞములలోని హింస హింసకాదని చెప్పకొనుచున్నారు. వేమన్న కీ హింసమాత్రమే కాదు. తన శత్రువును గూడ హింసించుట కిష్టములేదు—

                "ఆ. చంపఁదగినయటి శతృవు తనచేత
                      చిక్కెనేని కీడు చేయరాదు,
                      సఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు..." (1494)

నిజమే. శత్రుత్వము చావవలయునే గాని, శత్రువు చావవలయునని కోరుటయన్యాయము గదా ? ప్రకృతము మనుష్యు లింత దూరము అహింసావ్రతమును పాలింపజాలరు కాని, యెవఁడిట్లు చెప్పెనో యతని పేరనే గొఱ్ఱెలు, బఱ్ఱెలు బలి యిచ్చటనైనను, నిలుపఁ బ్రయత్నించుట వేమనయందలి యాభిమాసము గలవారి కెల్ల ముఖ్యధర్మ మనుటలో సందేహము లేదుగదా!

ఇతని స్వార్ధనీతులలో స్వానుభవము, వివేకము ఇంకను ఎక్కువగాఁ గాన

  1. * యూప స్తంభమునాటి, పశువులను జంపి, నెత్తుటిబురదను గలిగించి ఇందుచే స్వర్గమునకుఁ బోగలమేని నరకమునకిఁక పోపువాఁ డెపఁడు?-అని తాత్పర్యము.