పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                 వేమన కవిత్వము, హాస్యము, నీతులు 119

నుండెనా యట్లుండువఱకును అతని భావము మన హృదయమున నిలిచియుండి ఆ పద్యము పలుమాఱు జ్ఞప్తికి పచ్చను.

ఇట్లు కవి యభిప్రాయము లన్నియు మన మంగీకరించుట కవకాశ మియ్యని, బుద్ధి, అనుభవము మొదలగువాని భేదమట్లుండఁగా, వీనికన్నను బలవంతముగా నుండి మనుష్యులనహంకార త్యాగముచేయనియనివస్తువు వేరొకటి కలదు. అది నాగరకత. మనవేషము, భాష, నడత మొదలగు వాని స్వరూపము నిది నిర్ణయిం చును. అనేక కారణములచేత ఆప్పడపుడు నాగరకతకు సంబంధించిన యభి ప్రాయములు మాఱును. మన పూర్వికులు మగవారికిఁగూడ ఎలతేఁటి చాటులన బమ్మెరవోవఁదోలు తెగఁ బారెఁడు వెండ్రుక"లున్న నలంకార మనుకొనిరి. ఇప్ప డాఁడవారికిఁగూడ వెండ్రుకలెంత కుఱచగా కత్తిరించుకొన్న నంత నాగరకత యను భావము వ్యాపించుచున్నది. ఇటైనను మనము నీతిని ధర్మమునైనను వదలదుము గాని యనాగరకులముగా బైటవర్తింప నిష్టపడము. ఇతరులు మనలను నాగరకు లనవలెనను నాశతో మన మెంతో కష్టపడుదుము. అసత్యమునకైనను అంగీకరించి తిట్టవలసిస వానిని సభలో పొగడుదుము. కాబట్టి, కవి యొక్క పద్యములం దనాగరకపుమాటలు-అనఁగా, మన కాలమున నట్లు తలఁప(బడినవి. ఏమాత్ర మున్నను, అవి తటాలున అతని కవిత్వముచే మనకుఁ గలుగు మఱుపును మఱపించును. అభిప్రాయము వేరైనంతకష్టములేదు. వేమన పద్యములు ప్రజలయందీ నాగరకదృష్టిని పలుమాఱలు గమనింపక వ్రాయ(బడినవగుటచే వాని వ్యాప్తికిఁ గొంత విఘ్నము కల్గినదని వెనుకనే చెప్పితిని. కావున కవి సహృదయు లిరువురు పర స్పరము సర్దుకొనపలసినవారు. వీరిసామాన్యస్వభావము గమనించి మన్నించుచు అతడు తన స్వాతంత్ర్యమును కొంత వదలుకొసవలయును ; అతనియందలి విశేష గుణమువలని యానందఫల మనుభవించుటకై వీరు తమ స్వత్వమును చాలవఱకు త్యాగము చేయవలయును. వేమన్న తనధర్మము నిర్వహించుటలో కొంత యుదా సీనము చూపెను ; ఇప్పడతనిఁ దిట్టి ఫలములేదు. మనమును అతఁడు మాజాతిని దిట్టినాడని, మా పద్ధతులు తిరస్కరించినాఁడని, మా కసహ్యమైన యనాగరికపు మాటలుచెప్పి నాడని, మఱచిపోలెక మననము చేయుచుంటిమేని, యతని యసా ధారణ కవిత్వమునుండి కలుగఁగల యూనందమును లాభమును పోఁగొట్టుకొనిన వారమగుదుము.

వేమన కవిత్వమండలి యసాధారణుగుణములలో ముఖ్యమైనది భావముల తీవ్రత. అవి యంత తీవ్రముగా నుండుటకు కారణము ఆ భావము లతనివే కాని యితరులవి కాకపోవట, మనుష్యులలో ననేకులు ఎప్పడును ఇతరుల భావము లను తమపై నారోపించుకొనువారే. పదార్ధములు మంచివి చెడ్డవి యను సభిప్రాయ ములను అందఱును తమంతట పరిశీలించి యేర్పఱుచుకోలేరు. కావున "ననేక విషయములలో మన మితరుల యభిప్రాయములే యనువాదము చేయవలసి యున్నది. వంకాయ ఆరోగ్యకరమగునా కాదా యను విషయమున సామాన్యజను లందఱును వైద్యులయభిప్రాయమునే నమ్మవలయునుగదా ? కాని యది నా నాలుకకు రుచించునా రుచింపదా యను విషయమున(గూడ యితరుల మొగముఁ జూచి చెప్పవలసివచ్చెనేని, తక్కిన వెట్లైనను కవిత్వమున కది ప్రళయకాలము. ఈ విషయమున ప్రాచీనకవుల పారతంత్ర్యమును మొదలే విన్నవించితిని. ఇతరులకై వారు వ్రాసిన గ్రంథములలోనెల్ల సగానికి నగము కవిత్వము సున్న. ప్రాచీనులలో