పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 120

ననేకులు కవులనుట, వారి గ్రంథములకంటె, చాటు పద్యములలో నెక్కువగాఁ దోఁచును. అల్లసాని పెద్దిరాజు, తన ప్రభువగు కృష్ణదేవరాయలను మనుచరిత్రము పీఠిక యందెన్నియో తెఱఁగుల వర్ణించి, తనకతనియెడఁగల మొప్పు గౌరవము, ప్రేమ మొదలగు భావములు ప్రకటింపఁ బ్రయత్నించెను. కాని రాయల మరణానంతర మింటిలో మూలఁగూర్చుండి యేడ్చుచు చెప్పిన “యెదురైనచో తన మద కరీంద్రము డిగ్గి" అను పద్యము మన మనస్సులను గరఁగించినట్లు పై పీఠిక పద్య ములలో నొక్కటియును జేయఁజాలవనుట సహృదయ వేద్యము. కారణమిది శోకము పొంగిపొరలివచ్చునపుడు తనకొఱకే వ్రాసినది. అవి రామరాజభూషణముఁడు, రామభద్రుఁడు మొదలగువారి మొగములు చూచుచు వ్రాసినవి. ఈ దోషము ఆధునిక కవులలోను అనేకులకు కలదు. విచిత్రములయిన కల్పనలు చేయగల వాఁడు కవియని యిూ కాలపువారు తల(ప(గా, విచిత్రములైన భావములను జూపు వాఁడు కనియని యూ కాలపువారు తలఁచుచున్నారు. భరతమాత రాటము, రాధా కృష్ణులు మొదలగు విషయములఁ గూర్చి యీ కాలమున బయలు వెడలుచున్న యసంఖ్య పద్యములలో మక్కాలుమ్మువ్వీసము కవిత్వము సున్న. వీరుచూపు భక్తి, ప్రేమ, శోకము మొదలగు భావములన్నియు :సొంతముగా హృదయమం దుద్భవించినవిగాక, యే రవీంద్రనాథుని నుండియో, యే సరోజినీదేవినుండియో యెరవు తెచ్చుకొన్న పగుటచేత, ఈ పద్యములు, చిన్నబిడ్డలాడు నాటకములవలె కొంతవఱకు వినోదముగాను చాలపరకు అసహ్యముగాను ఉండును. వేమన యందిట్టి భావదాస్యములేదని వేఱుగ చెప్పఁబనిలేదు.

ఎప్పడు భావమిటు సహజమయ్యెనో, యుప్పడే భాషకొకవిధమైన బిగువును బలమును గలుగును. అది కృత్రిమమైన నిదియు సడలి తేపలుగా నుండును. భావము నిండు కడవవంటిది. భాష దానిని పైకీడ్చు త్రాడు. అసలు కడవయేలేని వట్టిత్రాటిని ఎంత నెమ్మదిగా నీడ్చినను అది చక్కగా దృడముగా మీఁదికి రాదు. ఊ(గులాడును; పరులుపడును; చే(దువానికి చేఁదునట్లే తో(పదు. అట్లే భావ దార్థ్యము లేని భాషలో ధారయుండదు ; పదముల చేరిక యొగుడుదిగుడుగా నుండును ; కంఠపాకమనుపించును గాని కవిత్వమనిపింపదు ; అధికపదములు దొర్లను. నాకుఁ జూడఁగా కవిత్వమున అపశబ్దములకంటె అధికపదములు గలుగుట పెద్దదోషము. అపశబ్దముచే వైయాకరణుల ముఖము చెడునుగాని కవి భావము చెడదు. అధికపదములచే తప్పక చెడును. తీవ్రమైన భావములు గల వానికే యట్టి తొడకులేని భాష వెడలఁ గలదు. అనగా, తీవ్రమైన బావములు వారికెల్ల అట్టి భాష వచ్చునని కాదు. అసలు కవి సృజింపఁబడినవానికే యీ న్యాయ మన్వయించును. తీవ్రమైన భావములు మనుష్యుల కందరికిని కలవు; కాని యా భావములను బైట బెట్టవలసినప్పడు మనకందరీకిని వచ్చునది కవిత్వముగాదు-నత్తి, కొందరి కది నాలుకకే యుంటియుండును. మరికొందరికిది వ్రాతలోను గలదు. కవులనఁబడువారిలో ననేకులిట్టి నత్తివ్రాఁతవారే. బుద్ధిమంతు లైన వారి కీరెంటికీని మందొకటే : చేతనైనంతవరకును మౌనము వహించుట.

వేమన యిట్లు తీప్రములైనభావములు, అడ్డులేని నాలుక కలవాఁడు కావననే యతని రచససలో భావము భాష యీ రెండును ఒకటితో నొకటి పందెము వేసికొని కుప్పించి యెగిరిసట్లు, హృదయమునుండి పైకివచ్చుచున్నవి. ఈ వేగమును నిరోధించుటకు ఛందస్సు యతిప్రాసలు మొదలగు ఏ నిర్బంధములకును చేతఁ