పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 118

మనఁగా, ఇక్కడ, క్లుప్తమైన కొలఁతగల యొక విధమగు శబ్దముల నడక, దీనికి తక్కిన యే పదార్థముల సాహాయ్యమును లేకయే మనలను మఱపించుశక్తి కలదు. మనము ఏపని చేయుచున్నను, ఎక్కడనో యొక మూలలో వినవచ్చు మృదంగము తప్పెట మొదలగు వాద్యముల లయప్రకారము వేరైనను ఆడించక యుండలేము. మనకన్న నాగరకత తక్కువగలవారు దాని వెంట నిస్సంకోచముగా నాట్యమే చేయుదురు. తీవ్రమైన భావమునకు, దానిని వ్యంజించు భాషకు తోడుగా నిదియు చేరెనేని 'చిచ్చునకుఁదోడు కరువలి వచ్చి' నట్లేకదా ? కావుననే కవిత్వము యొక్క పరిపూర్ణ ఫలము పాటలందు పద్యములందు లభించునంత వట్టి గద్యమందు లభింపదు. గద్యమందు కవిభావములు కవిభాషయు నుండవచ్చునే కాని, వానిని స్పష్టముగా పట్టిచూపు పంజరముండదు. అది యుండనిండు.

కవిత్వస్వరూపమునుగూర్చి నేఁజెప్పిన పైవిషయములలో క్రొత్తది యేమియు లేదు. కాని యందులో నొక విషయమును మాత్రము ముఖ్యముగా నొత్తి చెప్పుట కింత వ్రాయవలసెను : అది వినువారి యహంకార త్యాగము. వేమననంటి స్వతంత్రుని కవిత్వమందలి మాధుర్య మనుభవించుట కదిలేనిది సాధ్యముగాదు. వేమన పెక్కు బండబూతుపద్యములు వ్రాసెను. అట్టి పదములు మననిట నుచ్చ రింపరానివను భావము మనము మఱచిపోవఱకును వాని యందలి కవితా ధర్మము మనకు గోచరింపదు. వేదముల కాలమునుండి మనలో బూతులున్నవి. మనలోనే యేల ? అందఱియందును గలవు. కామాతురులును, వారిని ఖండించు వారును అన్ని భాషలందును బూతుకవిత్వమును వ్రాసినవారే. నేఁటికిని అట్టి వ్రాయువారు, విని సంతసించు వారును విద్యావంతులలోనే కలరు. కాని వానిని బైలుపఱుపరాదను భావము ఇప్పడు బలమగుచున్నది. అంతమాత్రముచేత అది కవిత్వము కాదనలేము.

కాని, యెవ్వరికిఁగాని * తాను' అను పదార్థ మొకటి యుండువఱకును అది పూర్తిగా లేదనుకొని మఱచిపోవుట యసాధ్యము. ఇతరులను మఱపించి వశము చేసికొనుటయే ప్రధాన ధర్మముగాc గలిగిన కవిగూడ నీ తత్త్వమును మఱవరాదు. ' నేను' అను నీ యహంకార ముండువఱకును, ధర్మము, నీతి మొదలగు వానిని గూర్చి బుద్ధిచే నేర్పడిన సిద్ధాంతము లెప్పుడును మన వెంటనే యుండును. కవికిని మనకును హృదయసత్వ మొక తీఱుగానుండి యూ కారణముచేత అతనియలదు జనించిన ప్రేమశోకాది భావములు మన హృదయమునందును ప్రతిబింబింప వచ్చును గాని, యిరువురి బుద్ధులు, అనుభవములు వేఱువేగుటచే అతని సిద్ధాంతములన్నియు మన మంగీకరింపలేము. చూడుcడు. వేమన్న యిట్లు వ్రాసెను:

               "ఆ, సతులఁ గవయనేల? సుతులఁ బడయనేల ?
                    వెతలు పడఁగనేల? వెఱ్ఱితనము :
                    నేలమీఁదిరాయి నెత్తికెక్కినయట్లు." (3827)

ఈ సిద్ధాంతమును మనలో నంగీకరించువారెందఱు ? నూటికొక్కరు గలరా? కాని యీ పద్యముఁ జదువునపుడు అతని హృదయమందు గల సంసారము మీఁది యసహ్యమను భావము క్షణమాత్రము మన హృదయములందును సంక్రమించును. అంత మాత్రమున వెంటనే మనము కావిబట్టలు కట్టుకొస(బోము. కవి కవిత్వ మింతటితో చరితార్థమైనది. కవి సిద్ధాంతములు మన యభిప్రాయములును ఒకటిగా