పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అం దచ్చువేసిరి. ఈకాలమున శాస్త్రులవారికి శ్రీ వేంకటగిరిమహారాజా, కీ.శే. శ్రీ గోపాలకృష్ణయాచేంద్రులవారి యాదరము లభించిఅది. శ్రీ మహారాజావారు స్వయము విద్యావంతులును విద్వత్పోషకులును. శాస్త్రులవారు కథాసరిత్సాగరములో నిట్లు వ్రాసినారు. "కథాసరిత్సాగరము...... నేను దొరంకొని ఆంధ్రలోకమును నమ్మి కొంతవఱకు నడిపి ఆంధ్రులకు ఈవిషయమున అక్కఱ చాలనందున అల్పసారుడను భగ్నారంభుడ నైతిని. ఇట్లుండ......శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్ర బహదర్ వారు ఆప్తవర్గమువలన మదీయ పూర్వోక్తోద్యమాపరిసమాప్తి నెఱింగి లోకోపకార పారీణతావశంవదులై ఏతదాంధ్రగ్రంథ రచనా ముద్రణాసమాసమునకు వలయుసహకారమెల్ల తా మొనర్చెదమని నాకుందెలిపించి, అట్లే వలసిన సకలధనమొసంగి యీ యుద్యమమును నెఱవేర్చి నన్నుం గృతకృత్యుంగావించినారు." అని.

'నానాఖ్యానమనోహరం' బైన యీప్రబంధ మొక యపూర్వశైలిలో రచియింపబడినది. కఠినపదాడంబరము లేక సులువైన పదజాలముతోనిండి కథాభాగములకు ఆయాచోట్ల అనువైనశైలితో ఎల్లవారికిని సులభగ్రాహ్యమై ఈ పుస్తకము ఆంధ్రవచనవాఙ్మయమున నొక నూతనశైలికి మార్గదర్శకమై యున్నది. కొందఱు ప్రబంధములలోని వచనముల శైలిని వ్రాయుచుండిరి. మఱి కొందఱు వీరేశలింగముపంతులు ప్రభృతులు ఆంగ్లగ్రంథముల సాంప్రదాయములను తెలుగులోనికి