పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

తెచ్చుచుండిరి. శాస్త్రులవారు తెలుగువారి జాతీయతను తోపింపజేయు తిక్కనాదుల సాంప్రదాయము ననుసరించి ఆంధ్రదేశమందు జనసామాన్యముయొక్క వాడుకభాషకు చేరువయైనభాషలో కథలను వ్రాసిరి. ఈవచనమున పటిమయు గాంభీర్యమును చక్కగానున్నవి. శైలి ఏమాత్రము హెచ్చు తక్కువలులేక సాపుగా నడచినది. శాస్త్రులవారిశైలి ననుకరించి పలువురు వ్రాసియున్నారు; ఇంకను వ్రాయుచున్నారు. కాని శాస్త్రులవారి శైలియందలి మాధుర్య గాంభీర్యములు మాత్రము అనుకర్తలకు అలవడకయున్నవి.

ఇది యిట్లుండగా శాస్త్రులవారి యచ్చాపీసు ఎక్కువ కాలము జరుగలేదు; వారిని ఆర్థికక్లేశముల పాలుగావించినది. వెంటనే శాస్త్రులవారు దానిని విక్రయించివైచిరి. తమయుద్యమమును తాత్కాలికముగా నాపివైచిరేగాని మరల ప్రారంభించు నుద్దేశమునుమాత్రము మానలేదు.


___________