పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

మును ఆంధ్రీకరింప నారంభించిరి. తమమిత్రులను ఎవరినైనను చదువుచుండుమని నియోగించి వారు చదువుచుండగా తాము తెలుగున వచనముగా చాలవడిగా వ్రాసికొనిపోవుచుండువారట. ఒకానొక రావుజీ, తెలిగ్రాపు ఆఫీసరు, సంస్కృతపండితుడు కొంతకాలము కథాసరిత్సాగరమును ఈపనికై చదువుచుండెను. శాస్త్రులవారు వ్రాయుటంజూచి ఆశ్చర్యపడెను. ఆతడు చదువుట నిలుపగానే శాస్త్రులవారి తెలుగువ్రాత పూర్తియయ్యెడిది. 'తంతిఆఫీసువాళ్లం, మేము ఇంతవడిగా వ్రాయలేమండీ' అని ఆతడు ఆశ్చర్యపడెను. వేఱుపనులచే దినమునకు ఐదుపుటలవంతున వ్రాసి కొంతకాలమునకు ఈ గ్రంథమును పూర్తిచేసి 1891 సం. ప్రకటించిరి. 1890 సం. సంస్కృత భోజచరిత్ర విక్రమార్కచరిత్రములను సంస్కరించి లఘుటీకలతో ప్రకటించిరి.

'ఇట్టిగ్రంథములు నన్నిటిని ఈప్రకారమే శోధించి అచ్చువేయ నుద్యుక్తుడనైయున్నాను. పండితులును, విద్యాశాలాధికారులును, విద్యార్థులును ఈ సదుద్యమమునకు సంతోషించి........ఈగ్రంథములకు ప్రచారము కలుగజేయుదురుగాక యని సవినయముగ కోరుచున్నాను' అని ప్రకటనగావించిరి.

శాస్త్రులవారికి, అచ్చాపీసును ప్రారంబించి అందు సంస్కృతాంధ్రగ్రంథముల శోధించి పరిష్కరించి ముద్రింపవలయునని యభిలాష పొడమినది. అంతట జ్యోతిష్మతీముద్రాక్షరశాలను 1890 ప్రాంతమున స్థాపించిరి. కథాసరిత్సాగర గద్యప్రబంధమును