పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిల్లరు: కానీయండి. శాస్త్రులవారూ, తాము రేపటి నుండియే కాలేజిలో ప్రవేశింపుడు.

ఈవిధముగా శాస్త్రులవారు తమగౌరవమునకు ఎంతమాత్రము లోపమురానీయక దర్పముతోనే కళాశాలా సంస్కృత ప్రథానపండితులైరి.

సంస్కృతోపాథ్యాయులైనవెనుకనే శాస్త్రులవారు బి.ఏ. చదువుటకు ప్రయత్నించిరి.

  • [1]"1887 సం. బి.ఏ. పరీక్షకు నియతములైన సంస్కృతాంగ్లేయ భాషలలో మదీయశిష్యులతో గూడ నేనును పరీక్షితుడనైతిని. రెంటను జయమొందితిని. సంస్కృతమందలి జేతలలో మొదటివాడనై విజయనగర మహారాజ వైసాఖపుర గోడెగజపతిరాయ దాతవ్యములైన రు 400 పరిమితిగల బహుమానమునకుం బాత్రమనైతిని. కాని ఆసంవత్సరము డిగ్రీని పూర్తిచేసికోనందున ఆ బహుమానముం బడయనైతిని. ఉక్త కారణంబున ఈబహుమానము నాకు తప్పిపోయినదని నాతో ఆపర్టుగారు సెలవిచ్చిరి."


___________
  1. * ఆం. సా. సభోపన్యాసము.