పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7-ప్రకరణము

కథాసరిత్సాగరము

గ్రంథరచనా ప్రారంభము నాటి మదరాసుజీవితము

క్రిశ్చియనుకాలేజి యుద్యోగము శాస్త్రులవారిజీవితములో నొక పెద్దమెట్టు; చాల ముఖ్యమైన ఘట్టములలో నొకటి. జీవితమునందు చక్కగా కుదురుపాటుకలిగెను. స్కూలు ప్రథానోపాథ్యాయుడుగా నలువదిరూపాయలు మాత్రమే జీతము. ఇప్పుడు నలువదియైదురూప్యములు వచ్చుచుండినవి. పూర్వముండినచోట అధికారులకును వీరికిని అభిప్రాయభేదముండినది. ఇప్పుడు శాస్త్రులవారికి స్వాతంత్ర్యగౌరవములు కలిగినవి; వారి పాండిత్యమునకు ప్రకాశమువచ్చినది; చిరకాలమునుండియు తా మపేక్షించుచుండినపదవి లభించినది; ఇది మొదలు శాస్త్రులవారిజీవితములో శాంతియు, గ్రంథరచనలకు అవకాశమును దొరకినవి; భావికీర్తికి పునాదు లీకాలముననే ఏర్పడినవి.

శాస్త్రులవారి నాటి మదరాసుజీవితము కొంత వినోదముగా నుండును. సంగీతకచేరీలు నేటివలెనే నాడును విశేషముగా జరుచుండెడివి. శాస్త్రులవారు తమ చదువులకు భంగమగునని వానికి పోవువారుకారు. జనవినోదినిలో 1883 సం. మునకు తర్వాతి సంచికలలో కొన్నివ్యాసములలో సంగీతమును గుఱించి వ్రాసియున్నారు. ఈవ్యాసములో స్వారస్యపు త్రాటికి మొదలు దొరకినది. ప్రతాపరుద్రీయమందలి యనేకవిషయ