పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

చెప్పిరి. 'మిమ్ము ఉద్యోగమునుండి నేను తొలగించిన నేమి చేసెదరు?' అని యాతడు మరల నడిగెను. వెంటనే శాస్త్రులవారు తడువుకొనక 'జిహోవా' యని బదులుచెప్పిరి. దొరకు ఆశ్చర్యమును సంతోషమును కలిగినవి. వారు గొప్ప వేదాంతులని గ్రహించి అది మొదలు వారిని గౌరవించుచుండెను. వేంకటరమణశాస్త్రులవారు బైబిలు చర్చలను విశేషముగా వినుచుండువారు. అందుచే 'జిహోవా' వారికి చిరపరిచితుడు.

వీరికి నలువురు కుమార్తెలును నలువురు కొమారులును జనించిరి. ప్రథమసంతానము కొమర్తె. ద్వితీయసంతానమే శ్రీ వేంకటరాయశాస్త్రిగారు. తృతీయులు వేంకటసుబ్బయ్యగారు. వీరింగూర్చి కథావశమున హెచ్చువ్రాయుదును. ఆఱవవారు ఎనిమిదిభాషలలో చక్కని వైదుష్యము సంపాదించి సుప్రసిద్ధచరిత్ర పరిశోధకులుగాను న్యాయవాదులుగాను ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటాచలముగారు. తర్వాతివారు శ్రీ సూర్యనారాయణశాస్త్రులవారు. నెల్లూరు వేంకటగిరిరాజ పాఠశాలాథ్యాపకులుగా నలువది సంవత్సరములకన్న హెచ్చుగా పనిచేసి ప్రస్తుతము నెల్లూర విరామముగా నున్నారు.

ఈవిధముగా పుత్రులను పౌత్రులనుం గాంచి, 83 సంవత్సరములు జీవించి 1900 సం. మున 'అనాయాసేనమరణమ్, వినాదై న్యేనజీవనమ్' అని పెద్దలు వాంఛించునట్లుగా ధన్యజీవితముం గడపి, కుమారులపాండిత్య పరమోఛ్ఛ్రితిం గాంచి, హర్షించి పండుముసలితనమున నొకదినము సాయంకాలము,