పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయనగారు శిష్టు కృష్ణమూర్తిగారికి గుంటూరు కాకినాడలలో పరిచితులు. కృష్ణమూర్తిగారికి చిన్నయసూరిగారితో కాళహస్తి, వేంకటగిరి సంస్థానములలో ఘర్శ్హణ. కృష్ణమూర్తిగారు బాలవ్యాకరణమును హరికారికలనుపేర సంస్కృతమున అనువదించుట. వారి యసత్యవాదము. అట్లు చేయగూడదని మా నాయనగారు కృష్ణమూర్తిగారిని హెచ్చరించుట.

పట్టిసము పుష్కరాలలో అమ్మవారిసన్నిధిలో కొండ మీద గుడిలో తపస్సు - ఆఱుమాసములు. అనంతభట్ల సుబ్రహ్మణ్య మనుపేర శిష్యుడు, జూవ్వలదిన్నెవాడు, తెచ్చియిచ్చు దోసెడు రేగుబండ్లు ఆహారము. వేఱు అన్నము లేదు. వారి శిష్యులు కాకినాడ పాఠశాలలో వారి యుద్యోగమును నిర్వహించి జీతముం దెచ్చి మా యింట ఇచ్చుచుండిరి."

వేంకటరమణశాస్త్రులవారు గొప్పవేదాంతులు, ఋషితుల్యులు. ఒకానొక పాఠశాలలో వారు పండితులుగా నుండు కాలమున ప్రిన్సిపాలుగా నుండిన దొర యొకడు విరామముం బొందగా క్రొత్తగా నొకడు వచ్చెను. ఆ సందర్భమున నందఱును ఆక్రొత్త ప్రిన్సిపాలు దర్శనము చేసికొనిరిగాని వేంకటరమణశాస్త్రిగారు మాత్రము ఆతనిదర్శనము చేసికొనలేదు. ఒకనెల గడచినయనంతరము ఆదొరయే వారిని పిలిపించి 'నీవేల మాదర్శనమునకు రాలే'దని వారిని అడిగించెను. అంతట శాస్త్రుల వారు 'నాధర్మమును నేను ఆచరించుచున్నాను. తమదర్శనము చేయకూడదని లేదు. చేయవలెనని తోచలేదు.' అని బదులు