పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐననేమి. చిరస్థాయియైన కీర్తినిగడించిరి. సంస్కృతాంధ్ర వాఙ్మయములందు కూలంకష ప్రజ్ఞావంతులని ప్రసిద్ధినందిరి. కవి, వ్యాఖ్యాత, ఉపాథ్యాయుడు, మహావక్త, సభారంజకుడు - అన్ని గుణములును వీరయందు మూర్తీభవించియుండినవి. తాతగారిరూపము నేత్రపర్వము. ఐదడుగులయెత్తు, గట్టిశరీరము, ఎక్కువస్థూలముకాకపోయినను మంచిపుష్టి, కొంతపొట్టివారివలెదవ్వునకు కనబడువారు. కాలేజి దినములలో నొక్కొకప్పుడు సూటుధరించువారు. సైకిలుపై నేగుచుండిరి. ఆదినములలో వారిరూపమును శృంగారనైషధమందలి చిత్రముచే నెఱుంగవచ్చును. తర్వాతిరూపము మనమెఱిగినదే. శరీరము లేతయెఱుపుదిరిగిన బంగారువర్ణము. ఆ ఉత్తుంగనాసావంశము, స్ఫుటమైన అవయవసౌందర్యము, ఆతేజోవంతమైన ముఖము విశాలఫాలభాగము ప్రాచీనభారతీయ ఋషిపుంగవుల జ్ఞప్తికిదెచ్చుచుండును. స్నేహితులతోను శిష్యులతోను ఆయావిషయములను మాటలాడునప్పుడు ఆనేత్రములకాంతియు, ఆ దరహాసమును, స్పష్టమును గాంభీర్య మాధుర్య పూరితమైన యాకంఠస్వరమును కనివినినవారిదే భాగ్యము.

ఆంధ్ర వాఙ్మయమున ఆదినుండి నేటివఱకును చూడగా కొందఱు భాషానుశాసకులైరి, కొందఱు కవులైరి. కొందఱు కేవలము అనువాదకులైరి, కొందఱు నాటకరచయితలైరి, కొందఱు నవలలుమాత్రమేవ్రాసిరి, కొందఱు విమర్శకులుగావెలింగిరి. ఇన్ని గుణములును ఒకరియందే పరిపూర్ణతంగాంచుట శ్రీ