పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదము వేంకటరాయశాస్త్రులవారి యందే గాంచితిమి. భాషారాధకులలో నిట్లు సర్వతోముఖ పాండిత్యము గలవారరుదు. ఆదర్శప్రాయులగు శ్రీ శాస్త్రులవారే ఆంధ్రవాఙ్మయమున నాధునికయుగకర్త లనంజెల్లుదురు. అన్నిటను నూతన మతావలంబకులు. పరమపదించినను ఆంధ్రసీమయందు గ్రంథములరూపమున నున్నారు. అక్షరరూపము నందినారు. ఆంధ్రులకు చిరస్మరణీయులైనారు. వీరిశిష్యులును ప్రశిష్యులును నేడు ఆంధ్రభాషారాధకులలో మహోన్నతస్థానము నందియున్నారు. ఇట్టి భాషా సమ్రాట్టును పడసిన యాంధ్రమాతదేభాగ్యము.


___________