పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆముక్తమాల్యద ఉపోద్ఘాతమున వ్రాసియున్నారు. శ్రీ మహారాజావారు తాతగారికి పారితోషికముగా రు. 1200 పూర్వ యుద్ధమునకు ముందొసంగిరి. తర్వాతవెలలు యుద్ధముచే హెచ్చినందున 'మహారాజావారొసంగినధనము ఆముక్తపు వ్రాతప్రతులను విలుచుటకును, ఓరియంటల్ లైబ్రరీలో గ్రంథశోధనలు సేయించుటకును వ్యయమైనది.'...శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారి ప్రేరణచే శ్రీయుత అల్లాడి కృష్ణస్వామయ్యగారు వేయిరూప్యముల నొసంగిరి. తాతగారు 'జీవికయు ఆ యతియులేక ఏతద్గ్రంథముద్రణ భారము క్రింద క్రుంగిపోవుచున్న' దినములవి. ఈకాలమున ననేకులు వారికి "శతాధిక రూప్యములనిచ్చి కష్టములను తొలగించుచుండిరి.' తాతగారిట్లు వ్రాసియున్నారు. 'ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు కొనవలసివచ్చినది. దుర్దైవవశమున మందదృష్టినైతిని. దానంజేసి కార్యసహాయులకై రు 1500 ఎక్కుడుగానే వ్యయమయినది. ఆసమయమున, నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి యీ గ్రంథము తప్పకముద్రితమగుగాకయని నెల్లూరుజిల్లా కావలి