పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25-ప్రకరణము

కళాప్రపూర్ణుని కడపటిదినములు. ఆముక్తప్రకాశనము

1925 సం. మున, నాలుగేండ్లక్రింద తాతగారికి సన్మానముచేసిన స్వాములవారు, భారతీకృష్ణతీర్థులు శారదాపీఠమున తమశిష్యులనుంచి తాము పురీజగన్నాధముననుండు శంకరపీఠమునకు జగద్గురువులై వచ్చిరి. వచ్చినవెంటనే తాతగారిని పురీజగన్నాధమునకు రప్పించిరి. తాతగారు, తమఋణము స్వాములవారి సాయముచే తీరుననియు, కుటుంబస్థితి బాగుపడుననియుందలంచి 1925 సం, అక్టోబరులో బయలుదేరిపోయి కొంతకాలము స్వాములవారితో నుండిరి. ఆసమయమున స్వాములవారి మఠము కొన్ని వ్యాజ్యపు చిక్కులలో నుండినందున వెంటనే మాకు వారు తలంచిన సాయము చేయలేక పోయిరి. తాతగారికి అనారోగ్యము హెచ్చయినందునను, ఆముక్తమాల్యదను ముద్రింపవలసి యుండినందునను 1926 సంవత్సరారంభమున బయలుదేరి మదరాసుకే వచ్చిచేరిరి. నెల్లూరి కాపురమును చాలించుకొనిరి. పురి-జగన్నాధముననుండిన కాలముననే తాతగారు ఆంధ్ర భారతము నంతయు పఠించి సవరించి ముద్రణోచితముంజేసినారు.

ఆముక్తమాల్యద 1927 సం జూలైనెలలో ప్రకటింపబడినది. ఈవ్యాఖ్యనువ్రాయుటకు తొలుత తాతగారిని ప్రేరేపించినవారు శ్రీ పీఠికాపురమండలేశ్వరులు శ్రీ రావు వేంకటకుమారమహీపతి సూర్యరావు బహద్దరువారు. తాతగారు