పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని త్వరపడినం బ్రయోజనమేమి. అట్లే నేను 40 సంవత్సరము లుపాసింపగా ఇప్పటికి మీప్రసాదము కలిగినది.

మదీయ భాషాభిమాన వివరము........

మదీయవాగ్దేవతాపూజలో - ఆవాహనము స్త్రీ పునర్వివాహదుర్వాదనిర్వాపణము, ఆసనసమర్పణము కథాసరిత్సాగరము, అర్ఘ్యము ప్రతాపరుద్రీయనాటకము, పాద్యము మేఘసందేశాంధ్రటీక, అలంకారము ఆంధ్రప్రసన్న రాఘవ నాటకాది విమర్శకింకిణీగణశింజానశారదాకాంచిక, నై వేద్యము శృంగారనైషధసర్వంకషవ్యాఖ్య........"

ఆంధ్రసాహిత్యపరిషత్తువారి యష్టమ వార్షిక సమావేశమునకు తాతగా రగ్రాసనాధిపతులుగానుండిరి.

నెల్లూరి వర్ధమానసమాజమువారు వీరిని 'అభినవ మల్లినాథ' బిరుదముతో గౌరవించిరి.

తిక్కనసోమయాజివిజయము ఉపన్యాసము. నెల్లూరి వర్ధమానసమాజమువారి కోరికమెయి తత్సమ్ముఖమున, పౌరసభలో 1919 సం, మేనెలలో పఠించిరి. ఇందు తిక్కనంగూర్చి పెక్కువిషయములం దెల్పిరి. అందు చమత్కారముగా నిట్లు చెప్పిరి. - "కారణవిశేషములచే కొందఱు గోదావరిజిల్లావారు 'తిక్కన నెల్లూరి తెలుగువెట్టి భారతమును పాడు చేసినాడు.' అని నిజమతిని మిత్రులతో దెలుపుకొనుటయు, వారు దానిని నెల్లూరి యువరసికులమ్రోలం బలుకటయు వీరు అందులకు కక్కసించుటయును సంభవించినది.