పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందులకుం బ్రతిమల్లముగా గుంటూరివారు తిక్కన తమ కృష్ణామండలమువాడనియు, భారతమునందు తమసీమ తెనుంగుంబెట్టి దానిని పుణ్యకృదాస్వాద్యమయిన సుథాతరంగిణిం గావించినాడనియు, వాదించుచున్నారు. - ఇప్పటికిని కృష్ణాపినాకినుల తెలుగులకు ఎక్కుడుభేద మగపడదు. సామ్యమే మెండు...తిక్కన నెల్లూరితెనుంగునే భారతమునంబెట్టినమాట వాస్తవమేగాని పాడుచేసెననుట పాడిగాదు. పాడిచేసెనని గుడికట్టించుట ఇహపర సాధకము."

ఇట్లు కాలము గడుచుచుండగా మదరాసునగరమునకు శ్రీ ఐదవజార్జి చక్రవర్తిగారి కుమారులు యువరాజుగా వేల్సు రాజకుమారులైనవారు (ఇప్పుడు విండ్సర్ ప్రభువు) 1922 సం. విచ్చేసిరి. ఆసందర్భమున మదరాసు విశ్వవిద్యాలయమువారి కోరికమెయి దక్షిణభారతదేశమందలి పండితులనెల్ల యువరాజుగారు సత్కరించిరి. శ్రీ తాతగారు ఆంధ్రపండితులలో ప్రథములుగా బంగారుతోడా, జోడుశాలువలచే సత్కరింపబడిరి.

నాటిదినచర్య కొంత వినోదముగా నుండును. ఆకాలమున నసహాయోద్యమము (N.C.O.) దేశమున ప్రవర్తిలు చుండెను. దేశమంతయు అట్టుడికిన ట్లుడికిపోవుచుండెను. ఆదినము (జనవరి 14 తేది, 1922 సం) ఊరిలో అల్లరులు హెచ్చుగా నుండినవి. జనులు ప్రోగై ఆపీసరులను, మోటారులలో పోవువారిని, ఆంగ్లవేషములవారిని పోనీయక ఆపుచు, వీథిమరమత్తు